ఏపీలో భానుడి భగభగలు.. ఏప్రిల్, మే నెలలు రాక ముందే మండుతున్న ఎండలు..
ఏపీ భానుడు ప్రతాపం చూపిస్తుండు. ఏపీ లోని రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న శనివారం అనంతపురంలో అధ్యధికంగా 40.8 డిగ్రాల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

ఈ నెలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంన ప్రాంతంగా రాయలసీయ లోని అనంతపురం డికార్డుకెక్కినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈనెల 27 వరకు ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉకిరిబికిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుండటంతో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు నగర వాసులు.. గత మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం-శుక్రవారం జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు, సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలలను తలచుకొని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.