Kamal Haasan : నేనేప్పుడు హీరోనే.. అందుకే నటించలేదు..
భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

Bharatiyadudu 2 starring Kamal Haasan is going to hit the audiences soon amid huge expectations.
భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి గా నటిస్తున్న కమల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా రోబో 2.0 సినిమాల్లో తానెందుకు నటించలేదోనన్న మ్యాటర్ ను రివీల్ చేయగా వైరల్ గా మారింది
భారతీయుడు 2 ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్…శంకర్,రజనీకాంత్ కాంబోలో వచ్చిన రోజో ‘2.ఓ’ మూవీ లో విలన్ గా లోకనాయకుడిని అప్రోచ్ అయ్యాడట. కానీ ఆ రోల్ కి నో చెప్పడంతో అక్షయ్ కుమార్ ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను ఎన్నేళ్లు అయినా హీరోగా ఉండాలనుకుంటున్నట్లు నవ్వుతూ అన్సర్ ఇచ్చాడు కమల్ .రోబోలో తాను హీరోగా ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు.
‘ఐ-రోబో’ ఇంగ్లీష్ నవలను రూపొందిస్తే చాలా బాగుంటుందని తాను.. శంకర్.. రచయిత సుజాత 90sలోనే అనుకున్నామని తెలిపాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి అప్పట్లో టెస్ట్ లుక్ కూడా జరిగిందని చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్ట్ నోచుకోలేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్, డేట్స్ ఇంకా ఎన్నో ఉంటాయి కాబట్టి. అయితే అప్పటి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా చేయకపోవడమే బెటర్ అనుకున్నాను. అందుకే విడిచిపెట్టేశానని.. కానీ దర్శకుడు శంకర్ మాత్రం పట్టువిడువలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రజనీకాంత్‌ను హీరోగా పెట్టి ‘రోబో’ సినిమాను తెరకెక్కించి ఘన విజయాన్ని సాధించాడు అని అన్నాడు.