భువనేశ్వర్ హ్యాట్రిక్, RCBలో ఫుల్ జోష్
టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన భువీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు.
టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన భువీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. తాజాగా జార్ఖండ్ తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లో భువనేశ్వర్ హ్యాట్రిక్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొదటి మూడు బంతుల్లోనూ ముగ్గురిని ఔట్ చేశాడు. రాబిన్ మింజ్ , బాలకృష్ణ, వివేకానంద్ తివారీలను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్ లో భువి 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 6 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కాగా భువనేశ్వర్ ప్రదర్శనతో ఆర్సీబీ ఫుల్ జోష్ లో ఉంది. మెగావేలంలో ఈ సీనియర్ పేసర్ ను ఆర్సీబీ 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.