Prabhas..allu arjun : భీభత్సం కాదు.. థియేటర్ల ఊచకోతే

రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బడా సినిమాలు సందడి చేయనున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీల కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఇక.. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోరాటాలు జరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2024 | 04:55 PMLast Updated on: Mar 17, 2024 | 4:55 PM

Big Movies Are Going To Make Noise At The Box Office In The Coming Days

రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బడా సినిమాలు సందడి చేయనున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీల కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఇక.. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోరాటాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలో.. మొన్న ఫిబ్రవరిలో కూడా కొన్ని చిత్రాల రిలీజ్ డేట్ల విషయంలో క్లాషెస్ వచ్చాయి. ఈసారి కూడా ధియేటర్ల క్లాష్ వచ్చేట్లు కనిపిస్తుంది. అది కూడా అలాంటి ఇలాంటి సినిమాల మధ్య క్లాష్ కాదు.. రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య బీభత్సమైన ఫైట్‌ జరగబోతోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీసు వార్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకే డేట్‌కి ప్రభాస్‌, బన్నీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రస్తుతం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలను కూడా ప్యాన్ వరల్డ్ టార్గెట్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కల్కి ని అయితే మేకర్స్ ఆల్రెడీ వరల్డ్ ప్రాజెక్ట్ గానే కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ఎప్పుడో ప్రకటించింది. కానీ నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ దెబ్బకి కల్కి వాయిదా తప్పేలా కనిపించండం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. ఆల్రెడీ పుష్ప 2 ఆగస్టు 15 డేట్ ని లాక్ చేసుకుంది. అయితే.. కల్కి మూవీకి కొత్త డేట్ గా ఇప్పుడు పుష్ప 2 డేట్ ఆగస్ట్ 15నే కల్కి మేకర్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తుందట.. అభిమానులు కూడా పుష్ప 2 విడుదలయ్యే అవకాశాలున్న ఆగస్టు 15న కల్కి చిత్రం కూడా రిలీజ్ చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ Vs అల్లు అర్జున్‌గా ఫ్యాన్స్ వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా వీళ్ల ఫైటింగ్‌ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కల్కిని ఖచ్చితంగా పుష్ప 2కి పోటీగా దింపాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ మేకర్స్ కూడా అదే డిసైడ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర అది బీభత్సం సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. అయితే.. బయట అల్లు అర్జున్- ప్రభాస్ బయట మంచి ఫ్రెండ్స్.. మరి.. బాక్సాఫీస్ వద్ద తమ సినిమాల ఫైట్‌కి ఈ ఇద్దరు హీరోలు ఒప్పుకుంటారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..