Pocharam Srinivas Reddy : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్..

నేను నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించాను.. ఆ తర్వాత టీడీపీ.. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్.. ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో నా సొంత గుడికి వెళ్తున్నాను.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 21, 2024 | 12:59 PMLast Updated on: Jun 21, 2024 | 12:59 PM

Big Shock For Brs Former Brs Minister Pocharam Srinivas Joined Congress Party

 

 

తెలంగాణ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోచారం నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కొద్ది సేపు చర్చలు జరిపి.. పోచారం తో పాటుగా ఆయన కుమారుడు బాస్కర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పునర్నిర్మాణం కోసమే పార్టీ మారుతున్న.. పోచారం

తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలందించారని తెలిపారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అనంతరం పోచారం మీడియాతో మాట్లాడుతు.. నేను రైతు బిడ్డను కాబట్టి వ్యవసాయంతో నాకు అనుబంధం బాగా తెలుసు.. కాబట్టే నేను రైతులకు అండగా ఉండాలని.. రైతులు బాగుపడాలని.. వారి కష్టాలు తీరాలని నేను పార్టీ మారుతున్నాను. కొత్త ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకు వెళ్తున్నారు.

నా జీవితం మొదలైంది కాంగ్రెస్ తోనే..

నేను నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించాను.. ఆ తర్వాత టీడీపీ.. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్.. ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో నా సొంత గుడికి వెళ్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి కార్య‌క్ర‌మాలు న‌చ్చి వారి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని కాంగ్రెస పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్ర‌మే నేను కోరుకుంటున్నాను.

పోచారం ఇంటి ముందు ఉద్రిక్తత..

మరో వైపు పోచారం ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతుండగా.. ఈ విషయం తెలుసుకోని హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇంటి బయట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బెదిరించి బీఆర్‌ఎస్ నేతలను తీసుకుంటోందని ఆరోపించారు. ప్రజా సమస్యల నుండి దారి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని విమర్శిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం ముగించుకోని సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిపోతుండగా.. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బాల్కసుమన్ యత్నించారు. దీంతో పోలీసులకు బీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటి పోక ముందే నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.