Gold Prices : పసిడి ప్రియులకు బిగ్ షాక్.. దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు..

పసిడి ప్రియులకు చేదు వార్త.. గత ఐదారు రోజులుగా వరుసగా డ్రాప్ అవుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఒక్క సారిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. బంగారం కొనేందుకు రెడీ అవుతుండగా.. ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. ఈ రోజు బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 12:16 PMLast Updated on: Dec 14, 2023 | 12:17 PM

Big Shock For Pasidi Lovers Gold Prices Have Increased Hugely In The Country

పసిడి ప్రియులకు చేదు వార్త.. గత ఐదారు రోజులుగా వరుసగా డ్రాప్ అవుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఒక్క సారిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. బంగారం కొనేందుకు రెడీ అవుతుండగా.. ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. ఈ రోజు బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

ఈ మధ్యకాలంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతు వస్తున్నాయి. భారీ ఊగిసలాట నడుమ కదలాడుతున్న గోల్డ్ ధరలు ఒక్కసారిగి పెరుగుదల కనిపించింది. (డిసెంబర్ 12) హైదరాబాద్ మార్కెట్ లో 56 వేల 650 రూపాయలకు తులం బంగారం ధర ఉండగా.. నిన్న (డిసెంబర్ 13) 1000 రూపాయలు ఎగబాకింది. దీంతో నిన్న 56 వేల 750 రూపాయలు తులం బంగారం మార్కెట్లో అమ్ముడు పోయాయి. (డిసెంబర్ 14) బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర .1,000 పెరిగి రూ. 57,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,090 పెరగడంతో రూ.62,890 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా .2,500 పెరిగి రూ.79,500కు చేరింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే రేట్లు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి.

  • విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,424గా ఉంది. కిలో వెండి ధర రూ.75,445కు పెరిగింది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,424గా ఉంది. కిలో వెండి ధర రూ.75,445కు చేరుకుంది.
  • ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,424కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,445కు చేరుకుంది.

గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. క్రమంగా ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని.. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం అని అంటున్నారు.