సంజూకి బిగ్ షాక్..

ఓ వైపు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా మరోవైపు యువ భారత్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నారు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 08:38 PMLast Updated on: Dec 19, 2024 | 8:38 PM

Big Shock For Sanju Samson

ఓ వైపు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా మరోవైపు యువ భారత్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నారు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి.మధ్యప్రదేశ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ముంబై రెండోసారి టైటిల్ నెగ్గి సత్తాచాటింది. ఈ ట్రోఫీలో సంజూ శాంసన్ కేరళకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేరళ జట్టు 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి నాకౌట్‌కు అర్హత కోల్పోయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో 2 టీ20 సెంచరీలు చేసిన సంజూ శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో ఒక అర్ధ సెంచరీతో సహా 135 పరుగులు మాత్రమే చేయగలిగాడు

విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 21 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం కేరళ జట్టును ప్రకటించగా, విజయ్ హజారే కోసం ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్ చోటు దక్కలేదు. వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు ముందు సన్నాహక శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లు మాత్రమే ఈ జట్టులో చేర్చబడ్డారు. సో ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరు కానీ సంజుపై వేటు పడింది. హజారే ట్రోఫీలో సంజూ శాంసన్‌ లేకపోవడంతో సల్మాన్ నిజార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా అనుభవజ్ఞుడైన బ్యాటర్ సచిన్ బేబీని కూడా జట్టులోకి తీసుకోలేదు. సన్నాహక శిబిరానికి ముందు 30 మంది సభ్యుల జాబితాలో సంజు శాంసన్‌ ఉన్నాడు. కానీ అతడు శిబిరానికి హాజరు కానందున జట్టులోకి తీసుకోలేదు. సో మొత్తం 30 మంది ఆటగాళ్ల నుంచి 19 మందికి తగ్గించారు.

సంజూ విజయ్ హజారే టోర్నమెంట్ కోసం సన్నాహక శిబిరానికి సంజు ఎందుకు హాజరు కాలేదో క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ కి లేక రాశాడు. అయినప్పటికీ అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఇకపోతే ఇది సంజు శాంసన్ కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం జట్టులో భారీ పోటీ కనిపిస్తుంది. వాళ్లలో సంజూ కూడా ఉన్నాడు. ఒకవేళ విజయ్ హజారేలో రాణిస్తే అతడిని ఛాంపియన్స్‌ ట్రోఫీలోకి తీసుకునే అవకాశం ఉండేది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కేరళ డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.