ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేస్ బౌలర్ నోర్జే ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. వెన్ను నొప్పి గాయంతో అతను ఈ టోరీ్నకి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. ఫిట్‌గా ఉన్నాడని సెలక్టర్లు నోర్జేను ముందు ఎంపిక చేశారు. అయితే స్కానింగ్‌లో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. టోర్నీ ప్రారంభమయ్యే లోగా అతను కోలుకునే అవకాశం లేదని తేలింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగక తప్పలేదు. నోర్జే గత ఆరు ఐసీసీ టోర్నీల్లో మూడు సార్లు చివరి నిమిషంలో టోర్నీ నుంచి గాయాలతోనే తప్పుకున్నాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఇప్పుడు మరో వన్డే టోర్నీకి దూరమయ్యాడు.నోర్జే స్థానంలో మరో ఆటగాడి పేరును దక్షిణాఫ్రికా ఇంకా ప్రకటించలేదు.[embed]https://www.youtube.com/watch?v=MlCpvIoPuZ8[/embed]