బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కడియం శ్రీహరి.. కడియం కావ్య..
బీఆర్ఎస్ (BRS) పార్టీకి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ (KCR) కి షాక్ లమీదా షాక్ లు తగులుతున్నాయి. గత రెండు నెలల కొద్ది కేవలం మాజీ ఎంపీలు... ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీకి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ (KCR) కి షాక్ లమీదా షాక్ లు తగులుతున్నాయి. గత రెండు నెలల కొద్ది కేవలం మాజీ ఎంపీలు… ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇంతలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చేప్పేశారు. తనతోపాటు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కవ్యా కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్ష్యంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరనున్నారు. దీంతో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బాయ్ చేప్పేశారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన ఘనపూర్ నుంచి గత మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ను తప్పించి ఆ స్థానం ను మాజీ మంత్రి శ్రీహరికి టికెట్ ఇచ్చారు.. మాజీ సీఎం కేసీఆర్. వరంగల్ పార్లమెంటు నుంచి అభ్యర్థి కోసం కాంగ్రెస్ అధిష్టానం సెర్చింగ్ చేస్తోంది. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉంది. కాంగ్రెస్ లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బిఆర్ఎస్ ను వీడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు చావుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు.
కడియం కావ్య లేఖ..
వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. ఆ వెంటనే.. ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలను కలిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
కడియం కావ్య కేసీఆర్ కు రాశిన లేఖలో.. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్ట్రం జరుగుతుంది. జిల్లాలో నాయకులందరు ఎవరికి వారే యమునా తీరులా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్ గారు.. బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను క్షమించండి అంటు లేఖలో పేర్కొన్నారు.
బారత రాష్ట్ర సమితి కి కేసీఆర్ మిత్రుడు.. బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నాట్లు ప్రకటించారు.
SURESH.SSM