KODALI NANI: గుడివాడలో కొడాలి నానికి భారీ షాక్‌..

ఏపీ ఎన్నికల్లో గుడివాడ మీద ప్రతీ ఒక్కరి శ్రద్ధ కనిపిస్తోంది. కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని.. టీడీపీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. అటు కొడాలి నాని కూడా తగ్గేదే లే అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. గుడివాడలో ఆసక్తికర సంఘటన జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 02:46 PMLast Updated on: Apr 13, 2024 | 2:46 PM

Big Shock To Kodali Nani In Gudivada Kodali Supporter Joined Tdp

KODALI NANI: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. కూటమి వర్సెస్ వైసీపీ పోరు.. రసవత్తరంగా కనిపిస్తోంది. ఇక అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్‌ జపాంగ్‌లు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ నుంచి కీలక నేతలంతా టీడీపీ కండువా కప్పుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు భారీగా వైసీపీలో చేరుతున్నారు. దీంతో ఎలక్షన్‌ సీన్‌ మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది.

Raghu Rama Krishna Raju: రఘురామకు లైన్‌ క్లియర్‌..? అనపర్తి, నరసాపురం టీడీపీకే

ఇక ఏపీ ఎన్నికల్లో గుడివాడ మీద ప్రతీ ఒక్కరి శ్రద్ధ కనిపిస్తోంది. కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని.. టీడీపీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. అటు కొడాలి నాని కూడా తగ్గేదే లే అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. గుడివాడలో ఆసక్తికర సంఘటన జరిగింది. కొడాలి నానికి భారీ షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నాయకుడు, కొడాలి నానికి రైట్‌ హ్యాండ్‌లాంటి షేక్ మౌలాలి.. పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పసుపు కండువా కప్పుకున్నారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో మౌలాలిలాంటి నాయకుడు.. వైసీపీని వీడి టీడీపీలో చేరడం కొడాలి నానికి షాక్‌గా మారడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.

మౌలాలితో పాటు రానున్న రోజుల్లో మరికొందరు.. వైసీపీ చెంతకు చేరే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దీంతో గుడివాడ రాజకీయం మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. మౌలాలి చేరికతో టీడీపీ నేతలకు ఆయుధం దొరికినట్లు అయింది. జనాలకు మంచి చేసేందుకు.. మౌలాలి లాంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తున్నారని.. నాని పచ్చి మోసగాడని.. అవసరం తీరిన తర్వాత వదిలేస్తాడని వైసీపీ నేతలే బహిరంగంగా చెప్తున్నారని టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.