Vikarabad : వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో గ్రామ ప్రజలు
వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుంది అని స్థానికులు భయాందోళనకు గురైవుతున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో రెండు వారాలకు పైగా పులి సంచరిస్తుంది. తాజాగా నిన్న రాత్రి చీలాపూర్ లో ప్రత్యక్షమైనట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు వెల్లడించారు.

Big tiger roaming in Vikarabad district Village people in panic
వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుంది అని స్థానికులు భయాందోళనకు గురైవుతున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో రెండు వారాలకు పైగా పులి సంచరిస్తుంది. తాజాగా నిన్న రాత్రి చీలాపూర్ లో ప్రత్యక్షమైనట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు వెల్లడించారు. చీలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు మరో ఇద్దరితో కలిసి రాత్రి పొలం దగ్గర కట్టిన పశువులకుమేత వేసేందుకు వెళ్లి వస్తుండగా.. దారి మధ్యలో ఓ పులి పొలం వైపుగా పరుగులు తీసినట్లు చెప్పుకోచ్చాడు ఆంజనేయులు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో చీలాపూర్ గ్రామ గుట్ట ప్రదేశంలో ఉండటంతో రాత్రి వేళ ఇళ్ల మధ్యకు పులి వచ్చే అవకాశం ఉందని ఎవరూ బయటకు రావద్దని గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ రాములు సూచించారు. ఇక అటవీ శాఖ అధికారులు సమాచారం అందికోని పులి పాదముద్రలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
IMD : భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
చీలాపూర్ పరిసర ప్రాంతంలో పులి సంచారంతో గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక దామగుండం, అనంతగిరి అటవీ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్ల కుండా అటవీ శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. పులి పాదముద్రలు అనంతగిరి అటవీ ఆడ పులులు, దామగుండం అటవీ మగ పులి సంచరిస్తుందని అటవీ అధికారులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. గ్రామ ప్రజలు అధికారులతో.. మీరు హెచ్చరికలతో సరిపెట్టకుండా ఎలాంటి ప్రాణాహాని జరగకముందే పులిని బంధించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
S.SURESH