Bigg Boss season 7 : తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‌మెంట్.. ఇంటిసభ్యుల తొక్క తీసిన నాగార్జున
వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే.. నాగార్జున క్లాస్ తో ఎపిసోడ్ మొదలైనట్లు రెండు ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. తేజు, యావర్ పై ప్రశంసలు కురిపించిన నాగ్.. సందీప్, అమర్ దీప్ పై ఫైరయ్యారు. వీడియో చూపించి మరీ వాయించేసాడు. ఫైనల్ గా తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‌మెంట్ అంటూ విరుచుకుపడ్డాడు. ఇక మరో ప్రోమో లో శోభా శెట్టి, శివాజీకి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు అర్థమవుతోంది.

Bigg Boss season 7 has come to the weekend. For the last five days the members of the house played the captaincy task as well as the rest of the games brilliantly
బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ కి వచ్చింది. గత ఐదు రోజులుగా ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ తో పాటు మిగతా గేమ్స్ ను అద్భుతంగా ఆడి మెప్పించారు. ముఖ్యంగా యావర్ కు తెలుగు నేర్పించేందుకు ఇంటి సభ్యులు పడిన కష్టాలు ఫన్నీగా అనిపించాయి. అంతలోనే ఇంటి సభ్యులను తెగ ఏడిపించాడు బిగ్ బాస్. ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ ను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక శనివారం రావడంతో.. హౌస్ లో జరిగిన రచ్చపై క్లాస్ తీసుకునేందుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ప్రోమోలు అదిరిపోయింది.
వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే.. నాగార్జున క్లాస్ తో ఎపిసోడ్ మొదలైనట్లు రెండు ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. తేజు, యావర్ పై ప్రశంసలు కురిపించిన నాగ్.. సందీప్, అమర్ దీప్ పై ఫైరయ్యారు. వీడియో చూపించి మరీ వాయించేసాడు. ఫైనల్ గా తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‌మెంట్ అంటూ విరుచుకుపడ్డాడు. ఇక మరో ప్రోమో లో శోభా శెట్టి, శివాజీకి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు అర్థమవుతోంది.
ప్రియాంక ,శోభా శెట్టి కి జరిగిన అన్యాయం గురించి నాగ్ మాట్లాడినట్లు ప్రోమోలో చూపించారు.ఇక శుభశ్రీ, గౌతమ్ లతో మాట్లాడారు. గౌతమ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నవ్వుతూనే. ఇక శివాజీ ప్రశాంత్ ను నిలబెట్టి మరీ కడిగేశాడు. జ్యూస్ నింజా ట్కాస్ లో ప్రశాంత్ చెబుతున్న ఎందుకు పట్టించుకోలేదని శివాజీని నిలదీశాడు. ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం నా వల్ల కాదంటూ అనర్స్ ఇచ్చాడు శివాజీ. అమర్ కి ఏం చెప్పినా అర్థం చేసుకోడు అన్నట్లుగా కట్ చేసిన ప్రోమో ఎపిసోడ్ పై క్యూరియాసిటిని పెంచేసింది.