Bigg Boss season 7 : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీ.. బృందాలుగా పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు..
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు.. పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. గజ్వేల్ లోని కొలుగురు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.

Bigg Boss season 7 winner Pallavi Prashant is on the run. Police are hunting for Pallavi Prashanth in teams.
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ని ప్రకటించిన రోజు డిసెంబర్ 17 గ్రాండ్ ఫినాలే .. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.. 2023 భారత్ ప్రపంచ కప్ ఓడిపోయిన కూడా బహుశా ఇంత రచ్చ జరగలేదు. రన్నరప్ అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని వీరంగం చేస్తు అన్నపూర్ణ స్టూడియో వద్ద రణరంగం సృష్టించారు. కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేయడం కాకుండా.. బిగ్ బాస్ రన్నర్ అప్ అమర్ దీప్ వెంటపడి తరిమి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఇంతటితో ఆగారా.. ఏకంగా అదేదో ప్రభుత్వం పడిపోయినట్లు.. ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నారాయణ వంటి నేతలు వేంటనే ఖండించారు. ఇంత ఉద్రక్తతలకు బాధ్యుడైన .. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ మీదు పలు సెక్షన్న కింద కేసు కూడా నమోదు చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఏ1గా బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్, ఏ 2 గా అతడి సోదరుడు పరశురాములు సహా మరి కొందరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్.. పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతని అచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. తనపై కేసు నమోదు అయిందని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉండడం, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంటాడంతో అతడి అనుచరులను,స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
పల్లవి ప్రశాంత్ కోసం 3 పోలీస్ బృందాలు..
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు.. పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. గజ్వేల్ లోని కొలుగురు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.
డిసెంబర్ 17 ఆదివారం రాత్రి .. ఏం జరిగింది.
డిసెంబర్ 17 ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ -7 విజేతగా ఎంపిక కాగా, పల్లవి ప్రశాంత్ విన్నర్ గా.. నటుడు అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. అమర్ దీప్ ను విజేతగా ప్రకటించకపోవడం తో అన్న పూర్ణ సూడియో వద్ద అయన అభిమానులు గొడవకు దిగారు.
మరోవైపు విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించాక అయన అభిమానులు సంబరాలు చేసుకుంటూన్నారు. ఇంతలో రన్నరప్ స్టూడియో నుంచి భయటకు వెళ్తుండగా.. అమర్ దీప్ కారు పై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. వీరు దాడి చేసుకోవడమే కాక అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సుల పై కూడా రాళ్ళు రువ్వీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అన్నపూర్ణ స్టూడియో బయట ఇద్దరి వ్యక్తుల ఫ్యాన్స్ రద్దీని చూసి పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అటుగా వెళ్ళొద్దని హెచ్చరించినా అతడు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ఓపెన్ టాప్ కార్ పై వెళ్ళాడు. దీంతో ఈ విధ్వంసం జరిగిందని పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్ ఆచూకీ లభ్యం..
ప్రస్తుతం ప్రశాంత్ కొమురవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులపై రాళ్ళు రువ్విన వారి కోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.