Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు.. షరతులివే..
నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 నుంచి ఏ-4 వరకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా పల్లవి ప్రశాంత్ ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది.
Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది. రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Jacqueline Fernandez: మనసు విరిచేశావ్.. ఆ ఫొటోలన్నీ బయటపెడతా.. జాక్వెలిన్‌కు సుకేష్ వార్నింగ్..
షో ముగిసిన అనంతరం, ఆదివారం రాత్రి.. బిగ్‌బాస్ హౌస్ బయట తన అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రశాంత్ అభిమానులకు, ఇతర పోటీదారుల అభిమానులకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్సులు, కంటెస్టెంట్ల కార్లు సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని కూడా కొందరు ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్‌తోపాటు అక్కడి ఘర్షణలకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పల్లవి ప్రశాంత్‌తోపాటు ఈ కేసులో దాదాపు 16 మందిని అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. అంతకు ముందు పల్లవి ప్రశాంత్‌ను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరారు. దీంతో పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వారి బెయిల్ కోసం ప్రయత్నించారు.
విచారణ జరిపిన నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 నుంచి ఏ-4 వరకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా పల్లవి ప్రశాంత్ ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం రూ. 15 వేలు డబ్బు పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలు ఇవ్వాలని సూచించింది. ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. కోర్టు తీర్పు కాపీ వెలువడ్డ అనంతరం అతడిని విడుదల చేసే అవకాశం ఉంది.