Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మిస్సింగ్.. ఫోన్ స్విచ్ఛాఫ్..
దాదాపు 100 రోజులకు పైగా జరిగిన బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడు, రైతుబిడ్డ ఐన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. సెలబ్రెటీలను కూడా పక్కకు జరిపి.. బిగ్‌బాస్ టటిల్ గెలుచుకున్నాడు. నేను మీలో ఒకన్ని అంటూ ప్రశాంత్ చెప్పిన మాటలకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. గుడ్ బాగుంది. కానీ.. ప్రశాంత్ గెలిచిన తరువాత అతని ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షనే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ చేసింది.
దాదాపు 100 రోజులకు పైగా జరిగిన బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడు, రైతుబిడ్డ ఐన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. సెలబ్రెటీలను కూడా పక్కకు జరిపి.. బిగ్‌బాస్ టటిల్ గెలుచుకున్నాడు. నేను మీలో ఒకన్ని అంటూ ప్రశాంత్ చెప్పిన మాటలకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. గుడ్ బాగుంది. కానీ.. ప్రశాంత్ గెలిచిన తరువాత అతని ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షనే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ చేసింది. గెలిచింది ప్రశాంత్ ఐతే.. రన్నరప్‌గా మిగిలిన అమర్‌దీప్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు. పల్లవి ప్రశాంత్ గెలిచింది బిగ్‌బాస్ 7 టైటిల్ మాత్రమే. అంతేకానీ అతనేం ఇండియాకి వరల్డ్ కప్ కొట్టలేదు. పీఓకేను వెనక్కి తీసుకురాలేదు. కానీ అతని ఫ్యాన్స్ చేసిన హంగామా మాత్రం అంతే రేంజ్‌లో ఉంది.
టైటిల్ గెలిచిన పాపానికి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్‌గా నిలిచిన యాక్టర్ అమర్‌దీప్‌ను అతని కుటుంబాన్ని దాదాపు చంపిపంత పని చేశారు. కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్ మీద కూడా దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ ఇదేం పద్దతని.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ ఇష్యూ మీద సీరియస్ అయ్యారు. అమర్‌దీప్ కారుమీద దాడి చేసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయం తెలిసి సైలెంట్‌గా ఉన్నాడా.. తెలియక సైలెంట్‌గా ఉన్నాడా తెలియదు కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ ఎఫెక్ట్ పల్లవి ప్రశాంత్ మీదే పడింది. టైటిల్ గెలిచినందుకు అభిమానించాలి అనుకున్నాళ్లు కూడా.. ఇదేం రచ్చ అని చీవాట్లు పెడుతున్నారు.
పాపం ప్రశాంత్‌కు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. సింపుల్‌గా సీన్ ఎక్కడికి వచ్చింది అంటే.. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఎక్కడున్నాడో తెలియదు.. ఎవరితో ఉన్నాడో కూడా తెలియదు. ఫోన్ కూడా స్విచ్‌ఆఫ్ వస్తుందని ఆయన తల్లిదండ్రులు చెప్తున్నారు. టైటిల్ గెలిచి దర్జాగా తిరగాల్సినవాడు.. ఇప్పుడు ఎవరికంటా పడకుండా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే.. ఏదైనా అతిమీరకూడదు అంటారు. ఒక రకంగా సీన్ ఇప్పడు ఎలా తయారయ్యింది అంటే.. గెలిచిన పల్లవి ప్రశాంత్ కంటే.. దాడికి గురైన అమర్‌దీప్ మీదే అందరికీ ఇప్పుడు సింపతీ వచ్చింది.