Surat BJP: తొలి సీటు గెలుచుకున్న బీజేపీ.. ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖేష్ దలాల్
గుజరాత్‌లోని సూరత్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటిస్తూ ఈసీ లెటర్ రిలీజ్ చేసింది.
Surat BJP: దేశంలో ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో మరిన్ని విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ గ్యాప్‌లోనే బీజేపీ తొలి ఎంపీ సీటు గెలుచుకుంది. గుజరాత్‌లోని సూరత్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటిస్తూ ఈసీ లెటర్ రిలీజ్ చేసింది.
PAWAN KALYAN ON KRISHNA: సూపర్ స్టార్ కృష్ణను పవన్ అవమానించాడా..? వాదనలో నిజమెంత..?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని తమ నియోజకవర్గం నుంచి ముగ్గురు వ్యక్తులు బలపర్చాల్సి ఉంటుంది. ఎంపీ ఎన్నికల్లో అయినా పార్లమెంట్ ఎన్నికల్లో ఐనా ఇది కామన్. అభ్యర్థిని బలపర్చిన వ్యక్తులు కూడా తమ అఫిడవిట్లు ఈసీకి సబ్మిట్ చేయాలి. వాళ్ల డాక్యుమెంట్స్‌పై కూడా ఈసీ స్క్రూటినీ చేస్తుంది. ఆ అఫిడవిట్‌లో తప్పులు ఉన్నా కూడా పూర్తి నామినేషన్‌ను తిరస్కరిస్తారు. ఇప్పుడు సూరత్ విషయంలో కూడా అదే జరిగింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేశారు. వీళ్లిద్దరి బలపర్చిన అభ్యర్థుల సంతకాలు సరిగ్గా లేవని అవి ఫోర్జరీ సంతకాలని ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరిపిన ఈసీ అది నిజమని తేలడంతో వాళ్లిద్దరి నామినేషన్‌ను తిరస్కరించింది.
నామినేషన్‌లో తప్పులు సరిచేసుకునేందుకు ఇవాళే ఆఖరి రోజుల కావడంతో కాంగ్రెస్‌కు అక్కడ ఎలాంటి ఆప్షన్ లేకపోయింది. దానికి తోడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా విత్ డ్రా చేసుకోవడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటించారు ఈసీ అధికారులు. దీంతో దేశంలో ఎన్నికలు ఇంకా పూర్తవ్వకుండానే బీజేపీ ఒక ఎంపీ సీటును తన ఖాతాలో వేసుకుంది.