BJP Election Manifesto Release : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్..
దేశంలో లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక దేశ పాలన పక్షం అయిన బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక దేశ పాలన పక్షం అయిన బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యువత, పేదలు, మహిళల అభ్యన్నతే లక్ష్యంగా.. మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ). ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ను మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో రూపొందించారు. మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరించారు.
ఈ మేనిఫెస్టోను సంకల్ప్ పాత్రాగా అభివర్ణించిన కమలదళం.. ‘మేదీ కి గ్యారెంటీ’ అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది. రాజ్యాంగ రూపకర్త, దళిత సమాజ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజే.. బీజేపీ, తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో… బీజేపీ ‘సంకల్ప పత్ర’ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది.
- విశ్వబంధు
- సురక్షిత భారత్
- సమృద్ధ భారత్
- గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్
- ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
- ఈజ్ ఆఫ్ లివింగ్
- సాంస్కృతిక వికాసం
- సుపరిపాలన
- స్వస్థ భారత్
- అత్యుత్తమ శిక్షణ
- క్రీడా వికాసం
- సంతులిత అభివృద్ధి
- సాంకేతిక వికాసం
- సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
లబ్ధిదారులకే మేనిఫెస్టో కాపీ..
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ ఆఫీసులో సామాన్య ప్రజలకు మేనిఫెస్టో తొలి కాపీలను ప్రధాని మోదీ అందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందిన పలువురికి వీటిని ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది.