BJP Candidates: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. 12 మంది మహిళలకు అవకాశం
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. దాదాపు 52 మందితో ఒక లిస్ట్ వెలువరించింది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. దాదాపు 52 మందితో ఒక లిస్ట్ వెలువరించింది. ఇందులో ముగ్గురు ఎంపీలను ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దింపేందుకు సిద్దమైంది. అయితే ఈటెల రాజేందర్ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. మొత్తం రాష్ట్రంలో 119 స్థానాలకుగానూ 52 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ – బండి సంజయ్,సిర్పూర్ – పాల్వాయ్ హరీశ్ బాబు, కోరుట్ల – ధర్మపురి అర్వింద్, ధర్మపురి – ఎస్. కుమార్ లకు కేటాయించారు. ఇందులో 12 మంది మహిళలకు చోటు కల్పించడం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.