BJP, Telangana : 15-20 స్థానాలపై బీజేపీ ఆశలు.. కమలనాథుల కోరిక నెరవేరేనా..?
పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్‌కు కౌండ్ డౌన్ మొదలైంది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ దాదాపుగా కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం తమకే అనుకూలం అని.. తమదే అధికారం అని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ నిజం అవ్వాలని లేదు.. అలాగని అబద్ధం అని కొట్టిపారేయలేం.
పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్‌కు కౌండ్ డౌన్ మొదలైంది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ దాదాపుగా కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం తమకే అనుకూలం అని.. తమదే అధికారం అని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ నిజం అవ్వాలని లేదు.. అలాగని అబద్ధం అని కొట్టిపారేయలేం. దీంతో కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది.. ఈవీఎం మిషన్లలో ఓటర్ల నిర్ణయం ఎలా ఉంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే పోలింగ్ తక్కువ నమోదు కావడంతో.. పోలింగ్ సరళి ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంటుందని అంచనా వేస్తుండగా.. బీజేపీ మాత్రం హంగ్ ఏర్పడితే తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. యువత ఎక్కువ శాతం ఓటింగ్ పాల్గొన్నట్లుగా అంచనాలు ఉండడంతో.. ఈసారి ఈసారి ఎక్కువ చోట్ల పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Nagarjuna Sagar : తెరపైకి.. సాగర్ వివాదం.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
కనీసం 40 నుంచి 50 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని.. వాటిలో 15 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ అంచనా వేస్తోంది. గతంతో కంపేర్ చేస్తే ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీకి 7శాతం ఓట్లు రాగా.. ఒక స్థానాన్ని గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 18శాతం ఓట్లు రాగా.. నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2018తో పోలిస్తే 2019 ఎన్నికల నాటికి బీజేపీ బాగానే బలం పుంజుకుంది. ఇక అప్పటికంటే ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని.. తక్కువలో తక్కువ 20స్థానాల్లోనైనా తమ అభ్యర్థులు గెలుస్తారని కమలం పార్టీ నమ్మకంతో ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీతో.. హంగ్ ఏర్పడితే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో బీజేపీ ఉంది. ఇక అటు తెలంగాణలో పోలింగ్ సరళిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇక్కడి బీజేపీ నేతలతో ఆరా తీశారు. ఇది మరింత ఉత్కంఠ రేపుతోంది. దీంతో కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.