Telangana Exit Polls : తెలంగాణలో బీజేపీదే హవా.. దెబ్బ అదుర్స్ కదా…
తెలంగాణ (Telangana) లో హోరాహోరిగా సాగిన లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు సంచలనంగా మారాయి.
తెలంగాణ (Telangana) లో హోరాహోరిగా సాగిన లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శింస్తుందని అందరూ ఊహించారు. లోక్ సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్ (CM Revanth) సహా కాంగ్రెస్ నేతలంతా చెప్పారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) కి చెప్పుకొదగ్గ సీట్లు రాకపోయినా.. గతంలో కంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటం గమనార్హం. అయితే.. ఆ వచ్చిన కొంచెం మెరుగైన ఓటింగ్ శాతం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే లోక్ సభ బరిలో దిగిన బీజేపీ.. 10 నుంచి 12 సీట్లు గెలుచుకోబోతున్నామంటూ ప్రకటించింది.
అంత సీన్ లేదని అంతా కొట్టేశారు. అయితే అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది.. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఫలితాల్లో చాలా సంస్థలు.. కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. మిగతా సంస్థల సంగతి ఎలా ఉన్నా… ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ (India Today Exit Poll) కొత్త చర్చకు కారణం అవుతోంది. బీజేపీకి 11 నుంచి 12 స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ 4 నుంచి 6 స్థానాలు.. brs ఒక్క ప్లేస్ కు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇండియా టుడే మాత్రమే కాదు.. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిత్ పోల్ సర్వేల్లో ఇలాంటి ఫలితాలే కనిపించాయి. ఆరా మస్తాన్ సర్వే ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేయగా.. బీజేపీకీ 8 నుంచి 9 వస్తాయని చెప్పటం విశేషం.
ఇక జన్ కీ బాత్ ఇచ్చిన ఫలితాల్లో.. కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 7 సీట్లే వస్తాయని చెప్పగా.. బీజేపీకి మాత్రం ఏకంగా 9 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పటం హైలైట్.. ఇక ఇండియా టీవీ- సీఎన్ ఎక్స్ సర్వేలో కూడా కాంగ్రెస్‌కు 6 నుంచి 8 సీట్లు వస్తే.. బీజేపీకి 8 నుంచి 10 సీట్లు రానున్నట్టు చెప్పింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయా సంస్థలు చెప్పినట్టుగా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం.. ఇక తెలంగాణలో హస్తం దూకుడుకు కమల దళం బ్రేకులు వేయటమే కాకుండా.. భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.