Nayab Singh Saini: హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ..
సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ నియమితులయ్యారు. రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం బీజేపీ తరఫున కురుక్షేత్ర నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
Nayab Singh Saini: హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ నియమితులయ్యారు. రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నయాబ్ సింగ్ సైనీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు బన్వరీ లాల్, జై ప్రకాశ్ దలాల్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
MS DHONI: ధోనీ తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో
నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం బీజేపీ తరఫున కురుక్షేత్ర నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. సీఎంగా నయాబ్ సింగ్ సైనీని ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. కొత్త సీఎంగా ఎన్నికైన సైనీ.. ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ పదవికి రాజీనామా చేయడంతో హరియాణా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్లే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఖట్టర్ రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. దీంతో కొత్త సీఎం కోసం బీజేపీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు నాయబ్ సైనీ వైపు మొగ్గుచూపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్‌ను బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన రాజకీయ అరంగేట్రం చేశారు.
తర్వాత పలు కీలక పదవులు చేపట్టారు. గతేడాది అక్టోబరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2016లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. చివరగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు.. ఖట్టర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కర్నాల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.