BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి హామీ
మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫెస్టో రూపొందించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపొందించింది. దేశ ప్రగతి, పేదలు, రైతులే, యువత, మహిళల అజెండాగా దీనిని రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
BJP Manifesto: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా సమక్షంలో ‘సంకల్ప పత్రం’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫెస్టో రూపొందించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపొందించింది. దేశ ప్రగతి, పేదలు, రైతులే, యువత, మహిళల అజెండాగా దీనిని రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Anushka Shetty : ప్రభాస్ ఫ్రెండ్, హీరోతో అనుష్క ఎఫైర్…?
మేనిఫెస్టోలో విశ్వబంధు, సాంస్కృతిక వికాసం, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, స్వస్థ భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సుపరిపాలన, ఈజ్ ఆఫ్ లివింగ్, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి 14 అంశాలను చేర్చారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలివి. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు అందిస్తారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ముద్ర పథకం ద్వారా అందించే రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడతారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతారు. మరో ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తారు. ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తారు. ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ పథకాన్న వర్తింప జేస్తారు.
Ramcharan : మరచిపోలేని అనుభూతి…
మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాల నిర్వహిస్తారు. తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తారు. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌లు ఏర్పాటు చేస్తారు. పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత అందిస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాట చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం అందిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌కు అనుగుణంగా పంటల మద్దతు ధర పెంచుతారు. వ్యవసాయ మౌలికవసతుల మిషన్ ప్రారంభించడంతోపాటు, వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక శాటిలైట్ ప్రయోగిస్తారు. సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
విమానయాన రంగం, విద్యుత్తు వాహన రంగాలకు ప్రోత్సాహం అందిస్తారు. డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచుతారు. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. వ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేస్తారు.దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభిస్తారు. స్టార్టప్‌లకు నిధులు, మెంటార్‌షిప్‌తో మద్దతు అందిస్తారు. అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక. విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ.