Veerappan’s daughter : వీరప్పన్ కూతురికి బీజేపీ ఎంపీ టికెట్ !
ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ (Smuggling) అంటే ఇండియాలో ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వీరప్పన్. కళ్లముందే సరుకు మాయం చేశాడన్నా అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పోలీసులు చెప్పే డైలాగ్.. వీరప్పన్ (Veerappan) కు సరిగ్గా సరిపోతుంది. వీరప్పన్ చెయ్యి పడిందంటే సరుకు మాయం కావాల్సిందే. ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం.. అడ్డు వచ్చిన అధికారులను కిడ్నాప్ చేయడం లేదంటే చంపేయడం.
ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ (Smuggling) అంటే ఇండియాలో ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వీరప్పన్. కళ్లముందే సరుకు మాయం చేశాడన్నా అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పోలీసులు చెప్పే డైలాగ్.. వీరప్పన్ (Veerappan) కు సరిగ్గా సరిపోతుంది. వీరప్పన్ చెయ్యి పడిందంటే సరుకు మాయం కావాల్సిందే. ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం.. అడ్డు వచ్చిన అధికారులను కిడ్నాప్ చేయడం లేదంటే చంపేయడం. ఇదే వీరప్పన్ స్టైల్. కొన్నేళ్లపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు ఈ స్మగ్లింగ్ కింగ్. కానీ వీరప్పన్ కూతురు మాత్రం తండ్రికి పూర్తి వ్యతిరేకంగా పెరిగింది. తండ్రి చేసిన పనులతో తమ కుటుంబం పడ్డ మరకలను కడిగేలా.. విరప్పన్ కూతురు విద్యారాణి గొప్ప విద్యావంతురాలైంది. ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేసి లాయర్‌గా ప్రాక్టీస్ కూడా చేసింది. చాలా కాలం నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ.. సొసైటీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బీజేపీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది.
ఇలా.. 2020లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది విద్యారాణి (Vidyarani). కొన్ని రోజుల్లోనే విద్యారాణికి బీజేపీ ప్రమోషన్ కూడా ఇచ్చింది. తమిళనాడు బీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అప్పటి నుంచి ఇటు సామాజిక సేవతో పాటు అటు పార్టీ కార్యక్రమాలు కూడా చురుకుగా నిర్వహిస్తోంది. చాలా కాలం నుంచి పార్టీకి ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు విద్యారాణికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విద్యారాణిని ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. నిజానికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే విద్యారాణి పోటీ చేయాల్సి ఉంది. కానీ అప్పుడు పోటీకి విద్యారాణి సుముఖత చూపలేదు.
దీంతో ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆరేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకున్న విద్యారాణి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది. వీరప్పన్ చనిపోయిన తరువాత చాలా కాలం పాటు వాళ్ల కుటుంబం అజ్ఞాతంలో ఉంది. తండ్రి చేసిన పనుల వల్ల వాళ్ల కుటుంబాన్ని ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం వెంటాడుతూనే ఉండేది. దీంతో తండ్రి తీరుకు పూర్తి విరుద్ధంగా పెరిగింది విద్యారాణి. ఓ లాయర్‌గా ఓ పొలిటీషియన్‌గా ఆమె ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయం. ఈ కారణంగానే ఆమెను ఎంపీ బరిలో దింపేందుకు బీజేపీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. వీటి తరువాత.. విద్యారాణి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.