‘BJP National Convention-2024’ : ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ జైన మత 108వ నగ్న ముని మృతి పట్ల ప్రధాని సంతాపం..

దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ (BJP National Convention-2024) రెండో రోజు సమావేశం కోనసాగుతుంది. సమావేశంలో ముందుగా బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ఇక రానున్న లోకసభ ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ప్రధాని తన ప్రసంగంలో దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చే సరికొత్త హామీల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 03:11 PMLast Updated on: Feb 18, 2024 | 3:11 PM

Bjp National Convention 2024 Prime Minister Condoles The Death Of The 108th Nagna Muni Of Jainism

దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ (BJP National Convention-2024) రెండో రోజు సమావేశం కోనసాగుతుంది. సమావేశంలో ముందుగా బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ఇక రానున్న లోకసభ ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ప్రధాని తన ప్రసంగంలో దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చే సరికొత్త హామీల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఎన్నికల్లో భాగంగా బీజేపీ ముందున్న సవాళ్లు, బాధ్యతల గురించి కూడా ప్రస్తావించనున్నారు. కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజు రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలపై చర్చ జరిగింది. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడే లక్ష్యంతో ఆర్టికల్‌ 370 ( Article 370) రద్దు కోసం “జనసంఘ్‌ వ్యవస్థాపకుడు” శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ తన జీవితాన్నే త్యాగం చేశారని, ఆయనకు నివాళిగా 370 సీట్లు గెలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ జాతీయ సమావేశాల ప్రారంభానికి ముందు శనివారం ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌ బేరర్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ..వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని నిర్దేశించుకున్న 370 సీట్లు.. ఒక సంఖ్య మాత్రమే కాదని, అదొక సెంటిమెంటు కూడా అని ప్రధాని మోదీ చెప్పుకోచ్చారు.

జైన మత 108వ నగ్న మునికి సంతాపం..

జైన మత 108వ ఆచార్య విద్యాసాగర్‌ (Jainism 108th Nagna Muni) జీ మహరాజ్‌ మరణం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభీష్ఠానుసారం దేహాన్ని విడిచివెళ్లిన విద్యాసాగర్‌ మహారాజ్‌ జీ మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. విద్యాసాగర్‌ మహరాజ్‌ మరణానికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాట్టిద్దామని పార్టీ కార్యవర్గానికి సూచించారు. దాంతో పార్టీ సభ్యులంతా లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నేతలు మౌనం పాటించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.