Arunachal Pradesh, BJP : దేశంలో ఖాతా ఓపెన్ చేసిన బీజేపీ పార్టీ.. అరుణాచల్ ప్రదేశ్ లో హ్యాట్రిక్ విజయం
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో 31 మెజారిటీ మార్కును బీజేపీ అందుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో 31 మెజారిటీ మార్కును బీజేపీ అందుకుంది. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ (BJP Party) దూసుకుపోతోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలు ఉండగా.. దాదాపు 31 సీట్లు కైవసం చేసుకుంది. అరుణాచల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేజిక్ ఫిగర్ 31 సీట్లు ఉండాలి. దీంతో వరుసగా మూడో సారి అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరో 14 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. కాగా పొలింగ్ కు ముందుగానే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. NPP రెండు, PPA, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు.
ఇప్పటికే రెండు సార్లు ఇక్కడ పట్టు నిలుపుకున్న బీజేపీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానుంది. ముఖ్యమంత్రిగా ప్రేమ ఖాండు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ కేవలం 50 నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే వెల్లడి కానున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.