BJP politics : చిరును ముందు పెట్టి బీజేపీ రాజకీయం.. ఏపీలో త్వరలో జరగబోయేది ఇదేనా ?
ఏపీ ముఖ్యమంత్రిగా (AP Chief Minister) చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేసిన వేళ... ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన తర్వాత.. మోదీ (Narendra Modi) చేసిన ఓ పని.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP politics) కొత్త చర్చకు కారణం అవుతోంది.

BJP politics with Chiru in front.. Is this what will happen soon in AP?
ఏపీ ముఖ్యమంత్రిగా (AP Chief Minister) చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేసిన వేళ… ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన తర్వాత.. మోదీ (Narendra Modi) చేసిన ఓ పని.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP politics) కొత్త చర్చకు కారణం అవుతోంది. మోదీ చెవిలో ఏదో చెప్పిన పవన్ కల్యాణ్.. ప్రధాని ప్రత్యేకంగా అన్నయ్య చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో మోదీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓవైపు చిరును.. మరోవైపు పవన్‌ను పక్కన పెట్టుకొని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. పవన్ మాములోడు కాదు అన్నట్లుగా మోదీ మాట్లాడిన మాటలకు చిరు పొంగిపోయారు. తమ్ముడిని చూసి ఆనందంలో మునిగిపోయారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ చేతులు పైకి లేపి మోదీ అభివాదం చేశారు.
మెగా బ్రదర్స్ ఇద్దరినీ.. మోదీ ప్రశంసించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. చిరు, పవన్‌ను మోదీ ప్రత్యేకంగా అభినందించడం.. ప్రత్యేకంగా మాట్లాడడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఏపీ భవిష్యత్ రాజకీయాలకు ఇది సంకేతమా అనే సందేహాలు తెరమీదకు వస్తున్నాయ్. భవిష్యత్‌లో చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి లాగుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఈ సందేహాల వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయ్. మెగాస్టార్‌కు ఉన్న రేంజ్ ఏంటో, ఫాలోయింగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లను గెలిపించండి అని చిరు కోరితే.. అభిమానులు బ్లైండ్‌గా ఫాలో అవుతుంటారు. ఈ క్రేజ్‌ను బీజేపీ వాడుకోవాలని ఫిక్స్ అయిందా అంటే.. నో అనే అవకాశమే లేదు. తెలుగు రాష్ట్రల్లో బలోపేతం కావాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నా.. ఏపీలో పరిస్థితులు మాత్రం కమలానికి అంత ఈజీ అనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జనసేనతో పొత్తు వ్యవహారంతో.. పార్టీని బలోపేతం చేసే అవకాశం దక్కినట్లు అయింది. పవన్ హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో అదుర్స్ అనిపించాడు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో పవన్, జనసేన.. ఏపీ రాజకీయాల్లో కీలకం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జోష్‌కు మరింత బలం అన్నట్లుగా చిరును బీజేపీ ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు అని పలువురి నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.
ఇక అటు చిరుకు కూడా బీజేపీ మొదటి నుంచి మంచి ప్రాధాన్యం కల్పిస్తోంది. అల్లూరి 125వ జయంతి వేడుకలకు మోదీ అతిధిగా హాజరైన సమయంలో.. అప్పటి సీఎం జగన్‌ను పక్కన పెట్టి మరీ.. చాలాసేపు చిరుతో వేదిక మీద ముచ్చటించారు. ఆ తర్వాత చిరుకు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఈ లెక్కన చిరును మచ్చిక చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. రాబోయే రోజుల్లోనూ ఇదే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. చిరంజీవిని బీజేపీ మళ్లీ రాజకీయాల్లోకి లాగే చాన్స్ ఉందని.. ప్రమాణస్వీకారం వేదికపై మోదీ చేసిన సందడికి అర్థం ఇదే అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో చిరు, పవన్ కీ రోల్ ప్లే చేయబోతున్నారని.. అన్నదమ్ములను పక్కనపెట్టుకొని చేతులెత్తి సందడి చేసి మోదీ సూచన ప్రాయంగా చెప్పింది ఇదే అనే టాక్ నడుస్తోంది. భవిష్యత్‌లో చిరు, పవన్‌ను ముందు పెట్టి మోదీ రాజకీయం నడిపిస్తారా అనే చర్చ జరుగుతోంది. బీజేపీ ఏదైనా చేయగలదు.. ఏదైనా సాధించగలదు.
ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకున టైప్ కాదు బీజేపీ. పొత్తుతో రాష్ట్రంలోకి ఎంటర్ అయి.. ఆ తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించడం.. కమలం పార్టీకి కొత్తేం కాదు. పవన్, మోదీ మధ్య ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవిని కూడా తమతో కలుపుకోవాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా కనిపిస్తోంది. అదే జరిగితే.. మెగా బ్రదర్స్ సహకారంతో బీజేపీ రానున్న రోజుల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి కనిపిస్తోంది. వద్దు అనుకున్నారు కాబట్టి చిరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే కావాలి అనుకుంటే.. బీజేపీ పెద్ద పీట వేసే అవకాశాలు లేకపోలేదు. సినిమా హీరోగానే కాదు.. రాజకీయంగానూ చిరుకు ఇప్పటికీ ఫాలోయింగ్ ఉంది. వీటన్నింటిని ఉపయోగించుకోవాలన్నది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. మరి ఇది నిజం అవుతుందా.. ఈ సందడి ఇక్కడికే పరిమితం అవుతుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.