BJP Target 10 Seats : తెలంగాణలో 10 స్థానాలపై బీజేపీ టార్గెట్

మరో 3 నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది.  తెలంగాణలో కనీసం 10 స్థానాలు దక్కిచుకోవాలని ప్లాన్ చేస్తోంది.  అందుకోసం ఇవాళ కోర్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మోడీ సభలకు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 08:31 AMLast Updated on: Jan 08, 2024 | 8:31 AM

Bjp Target 10 Seats In Telangana

ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ… దక్షిణాదిన కూడా అత్యధికంగా పార్లమెంట్  సీట్లు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.   మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యేలను గెలుపొందింది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పెరగడంతో ఈ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 10 గెలుచుకోవాలని ఆలోచిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు సార్లు పర్యటించే అవకాశముంది. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సభల్లో మోడీ పాల్గొంటారు. 8 మంది ఎమ్మేల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఒక్కొక్కరికి… ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి పొలిటికల్ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించనుంది. మిగిలిన 8 పార్లమెంట్ స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎంపీలు బాధ్యతలు తీసుకుంటారు. పార్లమెంట్ ప్రభారీలను, కన్వీనర్లను ఇప్పటికే నియమించింది బీజేపీ అధిష్టానం. ఇవాళ ఉదయం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇంఛార్జిలు, ప్రభారీ, కన్వీనర్ లతో సమావేశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ పై ఈ మీటింగ్ లో డిసైడ్ చేస్తారు. మార్చి ఒకటి లోపు తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలని ఆదేశించారు బీజేపీ సీనియర్ లీడర్ బన్సల్.  మోడీ, కేంద్ర ప్రభుత్వ విధానాలతో కూడి వాల్ రైటింగ్స్, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు.

మార్చి ఒకటి తరవాతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.  బీజేపీ అనుబంధ మోర్చల ఆధ్వర్యంలో మహిళ, యువ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లో ఒక మోర్చకు సంబంధించి జాతీయ స్థాయి సమ్మేళనం కూడా నిర్వహించనుంది బీజేపీ. గ్రామ చలో ప్రోగ్రాం లో భాగంగా ఒకే రోజు తెలంగాణలోని అన్ని పోలింగ్ బూత్ ల కమిటీలు, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించారు. కమిటీలు ఎప్పుడు వేయాలన్న తేదీని నిర్ణయిస్తారు. ఎన్నికల వరకు చేయాల్సిన కార్యక్రమాల కోసం వేసిన వివిధ కమిటీలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు