లారెన్స్ బిష్ణోయ్ వీడు మనిషి కాదు రాక్షసుడు
మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నారు. సల్మాన్‌ను ఖాన్‌ను నెత్తుడి మడుగులో ముంచేసిన రోజు, జోద్‌పూర్‌లోనే సల్లూభాయ్‌ను చంపేసిన రోజు తెలుస్తుంది మీకు మేము ఏమిటి అనేది అని... ఏమాత్రం బెరుకు , అసలే మాత్రం భయం లేకుండా ఈ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.
మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నారు. సల్మాన్‌ను ఖాన్‌ను నెత్తుడి మడుగులో ముంచేసిన రోజు, జోద్‌పూర్‌లోనే సల్లూభాయ్‌ను చంపేసిన రోజు తెలుస్తుంది మీకు మేము ఏమిటి అనేది అని… ఏమాత్రం బెరుకు , అసలే మాత్రం భయం లేకుండా ఈ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ఓ దారిదోపిడీ కేసులో జోద్ పూర్ కోర్టుకు హాజరైనప్పుడు కోర్టు హాల్ సాక్షిగా… లారెన్స్ బిష్ణోయ్ ఇలా రెచ్చిపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు…. ఇతడు పచ్చినెత్తురుతాగే గ్యాంగ్ స్టర్ అని..!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌ను మర్డర్ చేయాలని ఎన్నాళ్లగానో రెక్కీల మీద రెక్కీలు నిర్వహిస్తోంది బిష్ణోయ్ గ్యాంగ్. బ్లాక్ బక్‌ను వేటాడి చంపాడనే ఆరోపణలు సల్మాన్‌ఖాన్ మీద కమ్ముకున్న తర్వాత సల్లూ భాయ్‌ను టార్గెట్ చేసాడు లారెన్స్ బిష్ణోయ్. నిజం చెప్పాలంటే మొదట్లో అంతా లైట్ తీసుకున్నారు కానీ 2024 ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలోని సల్మాన్ అపార్ట్‌మెంట్ పై ఫైరింగ్ జరిగిన తర్వాత.. ఘటన జరిగిన 2నెలలకు… అంటే 2024 జూన్‌లో నలుగురు బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ను అరెస్ట్ చేసాక… సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని అర్ధం అయింది. ఇక నిన్న NCPలీడర్ సిద్ధిఖీ మర్డర్ తర్వాత…. అసలు ఎవరు ఈ లారెన్స్ బిష్ణోయ్ అనే ప్రశ్నకు డీటెయిల్డ్ సమాధానం తెలుసుకోవాలని ఇండియా తహతహలాడుతోంది!
1993 ఫిబ్రవరి 12న పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ గ్రామంలో జన్మించాడు లారెన్స్ బిష్ణోయ్. హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లారెన్స్ తండ్రి కానిస్టేబుల్. లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన వ్యవసాయంలోకి దిగాడు. చిన్నతనంలో లారెన్స్ ప్రవర్తన బాగానే ఉండేది కానీ 2010లో ఇంటర్ చదివేందుకు చండీఘడ్‌లోని DAV కాలేజ్‌కు వచ్చిన తర్వాత బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. అప్పటికే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ తో స్నేహం కుదిరాక లారెన్స్ బిష్ణోయ్ కంప్లీట్‌గా ఛేంజ్ అయ్యాడు. అక్కడి నుంచి పంజాబ్ యూనివర్సిటీలో లా పూర్తి చేసేలోపు గోల్డీ బ్రార్ గైడెన్స్‌లో లారెన్స్… నేరాలు చేయటంలో రాటు తేలాడు. అప్పటికే కొన్ని క్రిమినల్ కేసులను వెంటేసుకున్నాడు కూడా… అప్పటి నుంచి ఇప్పటి వరకు లారెన్స్ బిష్ణోయ్ మీద రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో మర్డర్, దారిదోపిడీ కేసులు అనేకం. 2012 నుంచి బిష్ణోయ్ జైల్లో ఉన్నదే ఎక్కువ. జైల్లో ఇన్నేళ్లు ఉండటం వల్లే నేర సామ్రాజ్యం మరింతగా విస్తరించగలిగాడు అనేది ప్రధాన ఆరోపణ. తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుట్టే నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారి పరిచయాలే … దావూద్ ఇబ్రహీం లెవల్లో లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ వరల్డ్ లో పాతుకుపోవడానికి ప్రధాన కారణమని పోలీస్ ఆఫీసర్స్ చెబుతారు.
2013లో లూథియానా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముక్తార్ అనే పొలిటికల్ లీడర్‌ను మర్డర్ చేసాడు లారెన్స్ బిష్ణోయ్. 2014లో రాజస్దాన్ పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ప్రధాన నిందితుడు లారెన్స్. తన సన్నిహితుడు మరొక గ్యాంగ్ స్టర్ అయిన రాకీని చంపేసిన… భుల్లర్ అనే మాఫియా డాన్‌ను 2020లో కాల్చిచంపింది కూడా లారెన్సే. 2022 మే 29న పంజాబ్ ఫేమస్ సింగర్ సిద్దూ మూసేవాలాను మాన్సాలో కాల్చిచంపిన కేసులో కీలక నిందితుడు లారెన్స్ బిష్ణోయ్. సిద్దూ మూసే వాలాను చంపింది నేనే అని గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించినప్పటికి.. జైల్లో ఉండి స్కెచ్ వేసింది మాత్రం బిష్ణోయ్. ఇవి మాత్రమే కాదు 2021 సెప్టెంబర్‌లో కెనడాలో జరిగిన గ్యాంగ్ స్టర్ సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖ హత్య, 2023 డిసెంబర్‌లో జోధ్‌పూర్ లో జరిగిన రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోమేధీ హత్యలోనూ అత్యంత కీలక పాత్ర పోషించిన నిందితుడు కూడా లారెన్స్ బిష్ణోయ్.
జైల్లో ఉన్నా సరే… VOIP సాఫ్ట్ వేర్ సహాయంతో తన గ్యాంగ్‌కు గైడెన్స్ ఇచ్చేవాడు, అనేక సెటిల్‌మెంట్లు చేసేవాడు.. ఇది తెలిసి భరత్ పూర్ జైలు నుంచి తీహార్ జైలుకు బిష్ణోయ్‌ను తరలించినా సరే… అక్కడి నుంచి న్యూస్ ఛానల్స్‌కు జూమ్‌లో ఇంటర్వ్యూలు, ఫోన్ ఇన్స్ ఇచ్చాడంటే బిష్ణోయ్ నెట్‌వర్క్ ఏమిటో అర్ధం చేస్కోవచ్చు. ఇన్ని చేసినా సరే ముంబై,పంజాబ్, రాజస్దాన్ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ను లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ NIA మాత్రం నెల రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ అరాచకలపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయింది. కొన్ని కేసుల్లో ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అయితే లేటెస్ట్‌గా Y కేటగిరి సెక్యూరిటీలో ఉన్న సిద్ధీఖీనే చంపిన బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను వదులుతుందా అనేదే భయపెడుతున్న ప్రశ్న.