Sophia Leone : నీలి చిత్రాల నటి సోఫియా లియోన్ ఆత్మహత్య..
కొంత కాలంగా అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. జరగడమే కాదు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో అకాల మరణం. ఇంతకుముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ మృతి చెందారు. తాజాగా మరో అడల్ట్ నటి (Blue Film Actress) ఆత్మహత్య చేసుకోని మృతి చెందింది.

Blue film actress Sophia Leone committed suicide..
కొంత కాలంగా అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. జరగడమే కాదు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో అకాల మరణం. ఇంతకుముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ మృతి చెందారు. తాజాగా మరో అడల్ట్ నటి (Blue Film Actress) ఆత్మహత్య చేసుకోని మృతి చెందింది. అశ్లీల చిత్రాల నటి సోఫియా లియోన్ అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది కనిపించారు. ఆమె వయసు 26 సంవత్సరాలు. 18 ఏళ్ల వయసులోనే సోఫియా అడల్ట్ ఇండస్ట్రీలో ప్రవేశించింది. ఈ నెల మొదట్లోనే ఈ ఘటన జరగ్గా తాజాగా ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. కాగా వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న అమెరికాలోని తన అపార్ట్‌మెంట్‌లో ‘ప్రతిస్పందించని స్థితి’లో సోఫియా లియోన్ (Sophia Leone) కనిపించినట్టు ఆయన పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ ‘గోఫండ్‌మీ’లో ఆయనీ విషయాన్ని వెల్లడిస్తూ సోఫియా స్మారకం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున భారమైన హృదయంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు.
సోఫియా ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిపారు. ఆమె మరణంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మరణానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వివరించారు.