చుక్కలు చూపిస్తున్న పడవలు, కట్ అవ్వట్లేదా…?
ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. మూడో రోజు కూడా పడవల తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని అధికారులు పిలిపించారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. మూడో రోజు కూడా పడవల తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని అధికారులు పిలిపించారు. లోకల్ గా ఉన్న బోట్స్ కూడా ఉపయోగించి బోట్సు తొలగింపుకు చర్యలు తీసుకుంటారు. వెల్డింగ్ కట్టర్లతో పడవలను కత్తిరిస్తున్నారు. అయితే ఇక్కడ పడవల బరువు అధికారులకు తలనొప్పిగా మారింది.
బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారింది. ఈరోజు సాయంత్రానికి ఒక పడవను తొలగించే అవకాశం ఉంది. బోట్ దృఢంగా ఉండటంతో ఆలస్యం అవుతుంది ప్రక్రియ. ఒక్క బోటు 15 గంటలకు పైగా కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక బోటు కటింగ్ కు 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి మధ్యాహ్నానికి ఒక బోటు అయినా బయటకు తీయాలని పట్టుదలగా ఉన్నారు.