గుడ్ న్యూస్: పైకి వచ్చిన బోటు

ప్రకాశం బ్యారేజ్ లో గేట్లకు అడ్డం పడిన బోట్లను వెలికితియటానికి నాలుగు కార్గో బోట్లను వినియోగిస్తున్నారు. నాలుగు అడుగుల మేర బోటు పైకి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 06:32 PMLast Updated on: Sep 17, 2024 | 6:32 PM

Boats Operation In Praksham Barrage

ప్రకాశం బ్యారేజ్ లో గేట్లకు అడ్డం పడిన బోట్లను వెలికితియటానికి నాలుగు కార్గో బోట్లను వినియోగిస్తున్నారు. నాలుగు అడుగుల మేర బోటు పైకి వచ్చింది. బోట్ల తొలగింపులో భాగంగా హెచ్ బ్లాక్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో బోటును పూర్తిగా కదిలించే అవకాశం ఉంది. ఇప్పటివరకు 10 పుల్లీలు, 10 చైన్‌ లాక్‌లు ఇంజనీర్లు వాడారు. ఇవాళ మరో 4 పుల్లీలు, 4 చైన్‌ లాక్‌లు వినియోగిస్తున్నారు.

80 టన్నులు అదనపు లోడ్‌ ను లాగుతున్నారు. 280 టన్నులు లోడ్‌ లాగడంతో 4 అడుగుల వరకు నీట మునిగిన బోటునుపైకి తీసేయత్నం చేస్తున్నారు. ఈ పడవల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నారని భావిస్తున్న సర్కార్… త్వరలోనే కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.