ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆక్సీజన్ సిలెండర్లు, ఏం జరుగుతోంది…?
ప్రకాశం బ్యారేజి వద్ద రెండోరోజు కూడా పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను ముక్కలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం బ్యారేజి వద్ద రెండోరోజు కూడా పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను ముక్కలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిన్న భారీ క్రేన్లతో తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అధికారులు… ఒక్కోటి 40 టన్నుల బరువున్న భారీ పడవలు చిక్కుకుని కదలక పోవడంతో పడవలను కోయాలని నిర్ణయం తీసుకున్నారు.
నది లోపలికి దిగి పడవలను కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. ప్రకాశం బ్యారేజీకి విశాఖ నుంచి వచ్చిన పదిమంది సభ్యుల డైవింగ్ టీం చేరుకొని పనులు మొదలుపెట్టింది. ఆధునిక పరికరాలతో నది లోపలికి వెళ్లి భారీ పడవలను రెండు ముక్కలుగా డైవింగ్ టీం కట్ చేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని నదిలో దిగి స్కోబా డైవింగ్ చేస్తూ బోట్లను రెండుగా కోస్తారు. అలాగే కట్ చేసిన ముక్కలను బయటకు తీయడానికి ఎయిర్ బెలూన్లను వినియోగిస్తున్నారు.