హిట్టు బొమ్మ, హరిహర వీరమల్లుపై బాబీ డియోల్ సెన్సేషనల్..
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా సరే సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే హడావుడి వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక సినిమా మేకర్స్ కూడా దాని గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో సినిమాను హైలో ఉంచుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాను ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.