Shakeela: బిగ్‌బాస్‌ సీజన్‌7లో షకీలా ఎంట్రీ

బోల్డ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే షకీలా బిగ్‌బాస్‌ స్క్రీన్‌ మీద తలుక్కుమంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 02:19 PMLast Updated on: Sep 06, 2023 | 2:19 PM

Bold Artist Shakeela Entered Bigg Boss Season 7

బోల్డ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే షకీలా బిగ్‌బాస్‌ స్క్రీన్‌ మీద తలుక్కుమంది. రీసెంట్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో షకీలాను కంటెస్టెంట్‌గా తీసుకున్నారు. బిగ్‌బాస్‌ అంటేనే ప్రేక్షకుల్లో స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ ఉంటుంది. ఈ షోలో క్రియేట్‌ అయ్యే కాంట్రవర్సీలు అన్నీ ఇన్నీ కావు. షకీలా లైఫ్‌లో కూడా అలాంటి కాంట్రవర్సీలు. ట్విస్ట్‌లకు కొదువేం లేదు. షకీలా నటించిన సినిమాలు అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మలయాళంలో పెద్ద పెద్ద హీరోలు సైతం షకీలా సినిమా రిలీజ్ అంటే భయపడిపోయేవారు. దాని వల్ల కొన్నాళ్ల తర్వాత తన సినిమాలు బ్యాన్ అవ్వాలని మాలీవుడ్ అంతా ఒక్కటయ్యింది. వేరే దారి లేక తను కూడా సినిమాల నుంచి తప్పుకుంది.

షకీలా ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. తన సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేసి, ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. అలా ఎన్నో కష్టాలు పడిన షకీలా.. చాలాకాలం తర్వాత బిగ్ బాస్ కన్నడలోని సెంకడ్‌ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షకీలాకు మలయాళ నటిగా గుర్తింపు లభించినా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అందుకే బిగ్ బాస్ కన్నడ టీమ్.. ఆమెను రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపిక చేసింది. బిగ్ బాస్ కన్నడ 9 సీజన్లు పూర్తి చేసుకుంది. రెండో సీజన్లో షకీలా వచ్చిందంటే.. దాదాపు 7 ఏళ్లు క్రితమే షకీలా బిగ్ బాస్ హౌస్‌‌‌ను చూసేసింది. అంటే, ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఆడటం ఆమెకు చాలా సింపుల్‌. అయితే, బిగ్ బాస్ కన్నడలో షకీలా.. 26 రోజులు మాత్రమే హౌజ్‌లో ఉండగలిగింది. 27వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ 7 సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.