Sharuk Khan: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బాద్ షా
షారూఖాన్ జీ20 సదస్సు గురించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Bollywood actor Shah Rukh Khan praised Prime Minister Modi on the G20 summit
ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు బాలీవుడ్ నుంచి మోదీకి ప్రశంసల వెల్లువ లభించింది. దీనిపై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా ముందుకు సాగేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
దేశ ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ చేసిన వీడియోని రీట్వీట్ చేస్తూ తన స్పందనను తెలిపారు షారూఖ్. జీ 20 సదస్సులో ప్రదాన భూమిక పోషించి అందరికీ నాయకత్వం వహించినందుకు అభినందనలు తెలిపారు. ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల మన ఖ్యాతి అంతర్జాతీయం స్థాయికి ఎగబాకుతుందన్నారు. అలాగే ఇతర దేశాలతో సత్సంబంధాలు మెరుగవుతాయని ఆయా దేశాల భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోదీని చూసి యావత్ భారతం గర్విస్తోందని.. మీ నాయకత్వంలో ఒంటరిగా కాకుండా ఐకమత్యంతో అందరూ సమీష్టిగా సమానంగా అభివృద్ది చెందుతామని తెలిపారు. ఈ సందర్బంగా వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే సందేశాన్ని జోడించారు.
జవాన్ సూపర్ టాక్..
ఇదిలా ఉంటే జవాన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. రోజుకు యావరేజ్ గా రూ. 100 కోట్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సుమారు రూ. 370 కోట్లు కలెకన్స్ సాధించినట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార, దీపికా, విజయ్ సేతుపతి, ప్రియమణి తోపాటూ పలువురు ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను అట్లీ దర్శకత్వం వహించారు.
T.V.SRIKAR