Kangana Ranuth: 12 డిజాస్టర్ల క్వీన్
కంగనా రనౌత్ గ్లామర్ ఉంది, మంచి నటిగా మ్యాటర్ ఉంది. కాని కిస్మతే భారీగా ఖరాబ్ అయ్యింది.. ఇది కంగనా వరుస ఫ్లాపుల స్టోరీ చూసిన విసుగొచ్చి, సోషల్ మీడియాలో కామెంట్లు పెంచారు.

Bollywood actress Kangana Ranaut has become a disaster queen with a series of scandals
కంగనా రనౌత్ గ్లామర్ ఉంది, మంచి నటిగా మ్యాటర్ ఉంది. కాని కిస్మతే భారీగా ఖరాబ్ అయ్యింది.. ఇది కంగనా వరుస ఫ్లాపుల స్టోరీ చూసిన విసుగొచ్చి, సోషల్ మీడియాలో కామెంట్లు పెంచారు. అసలే కంగనాకి నోరెక్కువ కాబట్టే, కాస్త విమర్శిస్తే తాట తీస్తుంది. దీనికి తోడు కంగనా అంటే పడని బ్యాచ్ బాలీవుడ్ లో గోటి కాడ నక్కల వేయిట్ చేస్తుంటుంది. చిన్న తప్పు దొరికితే ట్రోలింగ్ చేస్తుంది.
ఇప్పుడు అలా ట్రోల్ చేయటానికి కంగనానే కావాల్సినంత మ్యాటర్ ఇచ్చినట్టైంది. ఎందుకంటే తేజస్ మూవీ తన ధాక్కడ్, చంద్రముఖి 2 కంటే కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తేలింది. ఇదొక్కటే కాదు ఇలా ఇప్పటి వరకు 11 సినిమాలు ఫ్లాపయ్యాయి. 2015 లో వచ్చిన తనువెడ్స్ మను సీక్వెల్ తో హిట్ మెట్టెక్కిన కంగనా, ఆతర్వాత 8 ఏళ్లుగా గజినీలా బాక్సాఫీస్ మీద దండెత్తుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఆమధ్య వచ్చి ఫ్లాపైన సిమ్రాన్, మణికర్ణిక సినిమాలే ఫ్లాప్స్ అనుకుంటే, ఆతర్వాత వచ్చిన ప్రతీ మూవీ ఒకదాన్ని మించి మరోకటి అనేలా డిజాస్టర్ గా మారుతున్నాయి. దీంతో తన గత ఫ్లాప్సే హిట్స్ తో సమానం అనేంతగా కామెంట్లు పెరిగాయి