Sara Ali Khan: సౌత్ సినిమాల వైపుకు.. బాలీవుడ్ భామల చూపు
బాలీవుడ్ తారల చూపు మన టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. నార్త్ భామలు సౌత్ వైపు చూస్తున్నారు. అందులో సారా అలీఖాన్ ముందు వరుసలో ఉన్నారు.

Bollywood actress Sara Ali Khan is interested in doing films in South India
బాలీవుడ్ బ్యూటీస్ ఇప్పుడు ప్లాన్ మార్చారు. నార్త్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూనే సౌత్ ఆఫర్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఏ చిన్న ఆఫర్ వచ్చినా ఒడిసి పట్టుకుంటున్నారు.ఇప్పుడు ఇదే పూరి ప్రాజెక్ట్ కి ప్లస్ అయింది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో నార్త్ లేడీ సారా అలీఖాన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. మాస్ మసాల కంటెంట్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అయింది. రామ్ కెరీర్ ని ట్రాక్ లో పెట్టింది. దీంతో ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో సీక్వెల్ పార్ట్ తెరకెక్కిస్తున్నాడు పూరి. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ 2024 మార్చి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా చెప్పలేదు చిత్ర యూనిట్.
డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య ఛాన్స్ కొట్టేసినట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లే అని తెలుస్తోంది. రామ్ కోసం పూరి బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ ని బరిలో దించుతున్నట్లు బీటౌన్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ బ్యూటీ నార్త్ లో స్టార్ హీరోయిన్ గా హల్ చల్ చేస్తుంది. ధనుష్ ప్రాజెక్ట్ తో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రామ్ ప్రాజెక్ట్ తో తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇప్పటికే చర్చలు ఫినిష్ అయ్యాయని త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.