Aishwarya Rai Bachchan : చేతికి కట్టుతో కేన్స్‌కు ఐశ్వర్యరాయ్
బాలీవుడ్ (Bollywood) లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కు హాజరయ్యేందుకు బయలుదేరారు.

Bollywood Aishwarya Rai, Film Festival, Airport, Airport, Bollywood,
బాలీవుడ్ (Bollywood) లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కు హాజరయ్యేందుకు బయలుదేరారు. కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె ముంబయి విమానాశ్రయంలో దర్శనం ఇచ్చారు. అయితే ఆమె అక్కడ చేతికి కట్టు వేసుకుని ఫోటోలకు చిక్కారు. ఎయిర్ పోర్ట్ దగ్గర మీడియాతో ఐదు నిమిషాలు గడిపిన తర్వాత ఆమె లోపలికి వెళ్లిపోయారు.
ఐశ్వర్యారాయ్ కేన్స్‌లో ఎలాంటి డ్రస్ ధరించి దర్శనం ఇస్తారు? అనేది ఏటా అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఆమె అక్కడ ధరించే దుస్తులతో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు చూసిన అభిమానులు అంతా ఐశ్వర్యారాయ్‌కి ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె ఇలా ఎలా కేన్స్‌లో కనిపిస్తారంటూ? కొందరు కంగారు పడుతున్నారు. మరి కొందరేమో ఓ వైపు చేయి బాలేక పోయినా కేన్స్‌కు హాజరవుతున్న ఐశ్వర్యారాయ్ నిబద్ధతను మెచ్చుకుంటున్నారు.
ఫ్రాన్స్ వేదికగా జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏటా ఐశ్వర్యరాయ్ అద్భుతమైన డిజైనర్ డ్రస్ ధరించి అక్కడి రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిలా కట్టు కట్టుకున్న చెయ్యితో ఐశ్వర్య అలాంటివి అన్నీ ఎలా చేయగలరు? అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఐశ్వర్య అక్కడ ఎలా కనిపించనున్నారో వేచి చూడాల్సిందే.