బెజవాడ హోటల్ లోనే బాలీవుడ్ హీరోయిన్
ముంబై నటి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందే కేస్ హిస్టరీని ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో నమోదైన ఫిర్యాదుతో పాటు విచారణ అంశాలను పరిశీలిస్తున్నారు.

ముంబై నటి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందే కేస్ హిస్టరీని ఏపీ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో నమోదైన ఫిర్యాదుతో పాటు విచారణ అంశాలను పరిశీలిస్తున్నారు. రాజకీయ నాయకుల తో పాటు ఐపీఎస్ లపై వస్తున్న ఆరోపణలతో కేసును సిరియస్ గా తీసుకున్న ప్రభుత్వం… కేసుని సిఐడీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు పూర్వపరాలన్నీ ఇవ్వాలంటూ డిజిపి ఆదేశించారు.
ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. ఇక ఉదయం విజయవాడ చేరుకున్న హీరోయిన్ జేత్వాని హోటల్ లోనే ఉన్నారు. మధ్యాహ్నం ఆమెను విచారించే అవకాశం ఉందని అందరూ భావించినా ఆలస్యం అయింది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా వచ్చారు. ఇప్పటికే ఆన్లైన్లో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసారు. అసలు వాస్తవాలు తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించింది ఏపీ సర్కార్. విచారణ వ్యవహారం పై నాలుగు రోజుల్లో డీజీపీకి, సీపీకి ఏసీపీ స్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు.