Tollywood, Salar : పరువు కాపాడాల్సింది.. ప్రభాసే
చిరు ఏం చేయలేకపోయాడు. బాలయ్య ఏం చేసినా తెలుగు మార్కెట్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడు. ఇక ఏం చేసినా రెబల్ స్టార్ ప్రభాసే చేయాలి.

Bollywood is unfolding Patan earned thousands of crores In the same year another thousand crores in the form of jawan was confirmed
మూడేళ్లలో మొత్తం సినే రివర్స్ అయిపోయిందా..?
బాలీవుడ్ పడగలు విప్పుతోంది. పటాన్ వెయ్యికోట్లు రాబట్టింది. ఇదే ఏడాది జవాన్ రూపంలో మరో వెయ్యికోట్ల వసూళ్లు కన్ఫామ్ అయ్యాయి. 700కోట్ల వసూళ్ళు కాస్త వెయ్యి కోట్లవటానికి వారం పట్టదని తెలుస్తోంది. ఒక్క షారుఖ్ ఖాన్ వల్ల బాలీవుడ్ కి మళ్లీ పాత వైభవం వస్తున్నట్టుంది.
బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటోంది.. టాలీవుడ్ వెనకబడింది..?
సరే బాలీవుడ్ ఒకప్పుడు కాలర్ ఎగరేసేది, కాని బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలతో వాళ్ల గర్వం పోయింది. 2020 నుంచి బాలీవుడ్ కి హిట్లంటే ఏంటో మరిచిపోయే దుస్తితి వచ్చింది. అతికష్టం మీద పటాన్, జవాన్ హిట్లతో మళ్లీ పాత వైభవం వచ్చేలా ఉంది. అంతా ఓకే కాని, ఇలాంటి టైంలో తెలుగు సినిమా నలిగిపోతోంది. 500కోట్ల పైన రాబట్టని ఏ సినిమాకూడా తెలుగుమూవీకాదు. హిందీ, తమిల్, కన్నడ సినిమాలు దూసుకెళుతుంటే టాలీవుడ్ మాత్రం బాక్సాఫీస్ కింద నలిగిపోతోంది
తెలుగుని మళ్లీ వెలిగించే బాధ్యత రెబల్ స్టార్ మీదే..!
చిరు ఏం చేయలేకపోయాడు. బాలయ్య ఏం చేసినా తెలుగు మార్కెట్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడు. ఇక ఏం చేసినా రెబల్ స్టార్ ప్రభాసే చేయాలి. ఎందుకంటే తన సలార్ వెయ్యి కాదు కనీసం రెండు మూడు వేల కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ. అందులోనూ నవంబర్ లేదంటే డిసెంబర్ లో పక్కగా విడుదలయ్యే ఛాన్స్ ఉన్న సినీ సునామీ.. కాబట్టే బాహుబలి సీరీస్ లోసీన్ మార్చిన ప్రభాసే, మళ్లీ సలార్ తో మన జోరుని కంటిన్యూ చేస్తాడనే అంచనాలున్నాయి.