Bollywood : బాలీవుడ్ స్టార్ హీరో కూతురి కోసమే బ్రతుకుతున్నాడా…?
సాధారణంగా మన జీవితంలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. అసలు మనిషి పుటక పుట్టాక ఏదోక అలవాటుకు బానిస అవుతూనే ఉంటాం. దానికి ఏ ఒక్కరు అతీతులు కాదు అనేది వాస్తవం.

Bollywood star hero is living for his daughter...?
సాధారణంగా మన జీవితంలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. అసలు మనిషి పుటక పుట్టాక ఏదోక అలవాటుకు బానిస అవుతూనే ఉంటాం. దానికి ఏ ఒక్కరు అతీతులు కాదు అనేది వాస్తవం. సినిమా వాళ్ళు అయినా క్రికెటర్లు అయినా, వ్యాపారవేత్తలు అయినా ఎవరికి అయినా సరే అలవాట్లు ఉంటాయి. అయితే వాటి కారణంగా తమకు ఎంత నష్టం, తమ కుటుంబానికి ఎంత నష్టం అనేది గ్రహించి మానేయడం మాత్రం నిజంగా గొప్ప విషయమే కదా. అలా తాను కూడా తన కూతురు కోసం ఒక అలవాటు మానేసా అంటున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో (Star Hero)..
యానిమల్ (Animal) సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ (Pan World Star) అయిపోయిన రణబీర్ కపూర్ ఇప్పుడు యానిమల్ 2 (Animal 2) మీద కూడా దృష్టి పెట్టి కష్టపడుతున్నాడు. యానిమల్ సినిమాతో ఈ సీనియర్ యంగ్ హీరో కెరీర్ ఒక రేంజ్ లోకి వెళ్ళింది అనే చెప్పాలి. అలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు ఉన్న ఒక చెడు అలవాటుని తన కూతురు కోసం మానేసా అని చెప్పాడు ఈ హీరో. అసలు ఏంటి ఆ అలవాటు అనేది ఒకసారి చూద్దాం. మన వాడికి సిగరెట్ అలవాటు బాగా ఉండేదట. కాని కూతురు ఎప్పుడైతే తన చేతిలోకి వచ్చిందో ఆ అలవాటు ఇక కరెక్ట్ కాదని వదిలేసా అంటూ చెప్పుకొచ్చాడు.
తన కుమార్తె రాహా జన్మించినప్పుడు తనకు ఎదురైన అనుభవమే తన జీవితంలో ది బెస్ట్ అని అన్నాడు. అప్పటి వరకు తనకు ఉండే సిగరెట్ అలవాటు అసహ్యంగా అనిపించిందని, అసలు మరణం గురించి, ఆరోగ్యం గురించి ఏ రోజు కూడా భయపడని తనకు అప్పటి నుంచి భయం ఏర్పడిందని… అందుకే తాను ఆ అలవాటుని పూర్తిగా వదిలేసా అని సిగరెట్ లు తాగట్లేదని చెప్పుకొచ్చాడు. 40 ఏళ్ళ జీవితం ఒకలా ఆ తర్వాతి నుంచి మరోలా తన జీవితం ఉందని అన్నాడు. తన కూతురు పుట్టినప్పుడు తన గుండెను తీసి తన చేతుల్లో పెట్టినట్టు ఉందని మురిసిపోయాడు ఈ హీరో.