KANGANA POLITICS : రాజకీయాల్లో రింగ్ తిప్పుతా..
మరో సినిమా స్టార్ కూడా పాలిటిక్స్ లో చేరిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) బీజేపీ (BJP) లో జాయిన్ అయింది. పార్టీలో చేరడమే కాదు...ఈ పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) పోటీ కూడా చేయబోతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ఎంపీ సీటును కేటాయిస్తూ బీజేపీ ఐదో జాబితాలో ఆమె పేరు కూడా ప్రకటించారు.

మరో సినిమా స్టార్ కూడా పాలిటిక్స్ లో చేరిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) బీజేపీ (BJP) లో జాయిన్ అయింది. పార్టీలో చేరడమే కాదు…ఈ పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) పోటీ కూడా చేయబోతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ఎంపీ సీటును కేటాయిస్తూ బీజేపీ ఐదో జాబితాలో ఆమె పేరు కూడా ప్రకటించారు.
ఇప్పటి దాకా బాలీవుడ్ (Bollywood) లో సెన్షేషనల్ సినిమాలతో ఆకట్టుకున్న రంగనా రనౌత్ …ఇక రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది. తాను బీజేపీలో చేరినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆమెను మండి నుంచి పార్లమెంట్ కి పోటీ చేయిస్తున్నట్టు బీజేపీ కూడా ప్రకటించింది. ఈమధ్యే కంగనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అప్పుడే ఆమె కమలదళంలో చేరిపోతుందని అందరూ అనుకున్నారు.
కంగనా రనౌత్…. ముందు నుంచీ ప్రధాని మోడీకి (Modi) హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. బీజేపీకి, హిందూత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో మెస్సేజ్ లు పెడుతూ ఫైర్ బ్రాండ్ గా మారింది కంగనా రనౌత్. కొన్ని వివాదస్పద కామెంట్లు కూడా చేసింది. గతంలో మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఆమె చేసిన కామెంట్స్ తో నోటీసులు కూడా అందుకుంది. పరువు నష్టం దావాల్లో కోర్టు విచారణకు కూడా హాజరైంది. గత ఏడాదే పొలిటికల్ ఎంట్రీపై కంగనా హింట్ ఇచ్చింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటే… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. జనవరి 22నాడు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకల్లోనూ పాల్గొని హంగామా చేసింది. పూలు చల్లుకుంటూ… జై శ్రీరామ్ నినాదాలు చేసింది కంగనా రనౌత్. రాముడొచ్చాడు అంటూ ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేసింది.
కంగనా ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నప్ప సినిమాలో కూడా నటిస్తోంది. తను వెడ్స్ మనూ పార్ట్ 3 మూవీ షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. వీటితో పాటు క్వీన్ 2 కూడా సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో కాంట్రోవర్సీకి కేరాఫ్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా ఇప్పుడు పాలిటిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి.