Boney Kapoor: నోరు విప్పిన బోనీ కపూర్.. శ్రీదేవి చనిపోడానికి కారణం ఇదే..
ఫిబ్రవరి 24 2018. అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయిన రోజు అది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. బాత్‌రూంలో శవమై కనిపించారు. ఆమె మరణానికి సినీ ప్రపంచం మొత్తం కంటతడి పెట్టింది.

Boney Kapoor opens up about Sridevi's death
ఫిబ్రవరి 24 2018. అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయిన రోజు అది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. బాత్‌రూంలో శవమై కనిపించారు. ఆమె మరణానికి సినీ ప్రపంచం మొత్తం కంటతడి పెట్టింది. చనిపోడానికి కాసేపటి క్రితం వరకూ కూడా ఎంతో యాక్టివ్‌గా కనిపించిన శ్రీదేవి.. ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఆమెది నిజంగా సహజ మరణమేనా.. లేక ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు కూడా కలిగాయి. మీడియా కథనాలతో అందరి దృష్టి ఒక్కసారిగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ మీదకు వెళ్లింది. ఈ కేసులో దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను విచారించారు కూడా. బోనీ కపూర్‌పై లై-డిటెక్టర్ ఉపయోగించారు. కానీ ఆయన నిర్ధోషని తేలడంతో వదిలేశారు. దాదాపు ఆరేళ్ల తరువాత శ్రీదేవి మరణానికి అసలు కారణం చెప్పాడు బోనీకపూర్. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణం గురించి మాట్లాడాడు.
శ్రీదేవిది సహజ మరణం కాదని బోనీ కపూర్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అందంగా కనిపించేందుకు శ్రీదేవి చాలా కఠినమైన డైట్ ఫాలో అయ్యేదట. ఉప్పు ఉన్న ఆహారాన్ని ఆసలు తీసుకునేది కాదట. కానీ శ్రీదేవికి లో-బీపీ ఉంది. ఉప్పు లేని ఆహారం తినడం ప్రమాదకరమని డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పినా శ్రీదేవి పట్టించుకునేది కాదట. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం నాగార్జున కూడా తనతో చెప్పాడన్నారు బోనీ కపూర్. నాగార్జునతో సినిమా చేస్తున్న టైంలో శ్రీదేవి కళ్లు తిరిగి కింద పడిపోయిందంట. ఆ టైంలో ఆమె పళ్లకు బలమైన గాయాలు కూడా అయ్యాయని నాగార్జున చెప్పారట. దుబాయ్‌లో కూడా బాత్ రూంలో ఇదే జరిగిందన్నారు బోనీకపూర్. లో-బీపీ కారణంగా కింద పడిపోయి శ్రీదేవి చనిపోయిందని చెప్పారు. శ్రీదేవిని పెళ్లి చేసుకునే వరకూ ఆమె ఫాలో అవుతున్న డైట్ గురించి బోనీ కపూర్‌కు తెలియదట. పెళ్లయ్యాక ఎన్నిసార్తు చెప్పినా శ్రీదేవి తన డైట్ మార్చుకోలేదట. ఆమె పాటించిన డైటే ఆమె ప్రాణం తీసిందని చెప్తూ ఎమోషనల్ అయ్యారు బోనీ కపూర్.