బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, కపిల్ రికార్డుపై కన్నేసిన బూమ్రా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి జరగబోతోంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా సారథ్యం వహించనున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 02:21 PMLast Updated on: Nov 21, 2024 | 2:21 PM

Border Gavaskar Trophy Bumrah Eyes Kapils Record

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి జరగబోతోంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా సారథ్యం వహించనున్నాడు. కాగా బూమ్రా భారత దిగ్గజ బౌలర్‌ కపిల్‌ దేవ్‌ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్‌ దేవ్‌ పేరిట ఉంది. కపిల్‌ ఆసీస్‌ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ సారి ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్‌ రికార్డును బూమ్రా అందుకునే అవకాశముంది.