బాక్సింగ్ డే కింగ్ రాహుల్, హ్యాట్రిక్ సెంచరీపై కన్ను
భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిసిపోయాయి. తొలి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే.. రెండో మ్యాచ్ లో ఆసీస్ విక్టరీ కొట్టింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిసిపోయాయి. తొలి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే.. రెండో మ్యాచ్ లో ఆసీస్ విక్టరీ కొట్టింది. మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇకపై జరిగే రెండు టెస్టులు కీలకంగా మారాయి. సిరీస్ విజయం ఎవరిదో ఇవే డిసైడ్ చేయబోతున్నాయి. ఈ సిరీస్ ఆరంభం నుంచి భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్ పై అంచనాలున్నాయి. కేఎల్ రాహుల్ ఓ అదురైన హ్యాట్రిక్ సెంచరీల రికార్డుపై కన్నేశాడు. ఒకవేళ ఈ టెస్టులో శతకం చేస్తే అరుదైన ఘనత దక్కించుకుంటాడు.
మెల్‍బోర్న్‌లో ఆసీస్‍తో జరిగే నాలుగో టెస్టులో సెంచరీ సాధిస్తే రాహుల్ బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత సాధిస్తాడు. క్రిస్మస్ తర్వాతి రోజైన డిసెంబర్ 26న మొదలయ్యే టెస్టును బాక్సింగ్ డే టెస్టు అని అంటారు. 2021, 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో కేఎల్ రాహుల్ సెంచరీలు చేశాడు. 2021లో సెంచూరియన్‍లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులతో శతకం చేశాడు కేఎల్ రాహుల్. 2023లో ఇదే వేదికలో బాక్సింగ్ డే మ్యాచ్‍లో సెంచరీ బాదాడు. ఇప్పుడు, 2024లో ఆస్ట్రేలియాతో మెల్‍బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్ శతకం సాధిస్తే అరుదైన రికార్డు సాధిస్తాడు. బాక్సింగ్ డే టెస్టులో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత దక్కించుకుంటాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‍లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడుతున్నాడు. మంచి టెక్నిక్ చూపిస్తున్నాడు. ఈ సిరీస్‍లో ఇప్పటి వరకు భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా రాహుల్ ఉన్నాడు. ఈ సిరీస్‍లో మూడు టెస్టుల్లో 235 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్‍పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ టెస్టులో సెంచరీ చేస్తే బాక్సింగ్ డే శతకాలు రికార్డు దక్కుతుంది.మరి ఫామ్ ఉన్న రాహుల్ మెల్ బోర్న్ లో శతకం చేస్తాడేమో చూడాలి.