టికెట్లన్నీ ఖతమ్, బాక్సింగ్ డే టెస్ట్ క్రేజ్

టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ తగ్గిపోతోందంటూ చాలా కాలంగా క్రికెట్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు అత్యుత్తమ జట్లు తలపడితే మాత్రం ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారన్నది మరోసారి రుజువైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 06:45 PMLast Updated on: Dec 11, 2024 | 6:45 PM

Boxing Day Test Tickets Bookings Finish

టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ తగ్గిపోతోందంటూ చాలా కాలంగా క్రికెట్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు అత్యుత్తమ జట్లు తలపడితే మాత్రం ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారన్నది మరోసారి రుజువైంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే దీనికి ఉదాహరణ… ఇప్పటికే సిరీస్ లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. అటు ఫ్యాన్స్ కూడా బాగా ఆస్వాదించారు. మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియానికి క్యూ కట్టారు. తొలి రెండు టెస్టులకు స్టేడియాలు కళకళలాడాయి. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ మొదలు కాబోతోంది. అయితే మూడో టెస్ట్ కంటే కూడా బాక్సింగ్ డే టెస్టుకు క్రేజ్ మరింత పెరిగింది.

ఇంకా మ్యాచ్ కు 15 రోజుల టైమ్ ఉన్నప్పటకీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన తొలి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప‌బ్లిక్ సేల్ ప్రారంభించిన కొద్ది స‌మ‌యంలోనే మ్యాచ్ తొలి రోజు టికెట్లు అమ్ముడు పోయిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ స్టేడియం కెపాసిటీ 90 వేలు. మిగిలిన రోజు టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఇదిలా ఉంటే.. పింక్ బాల్ టెస్టుకు కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. మూడు రోజుల్లో 1,35,012 మంది ప్రేక్ష‌కులు హాజ‌రయ్యారు. మొద‌టి రోజు 50,186 మంది, రెండో రోజు 51,542 మంది ప్రేక్ష‌కులు మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు.

ఇరు జట్ల మధ్య సిరీస్ రసవత్తరంగా సాగుతుండడంతో మిగిలిన మ్యాచ్ లకు కూడా ఫ్యాన్స్ పోటెత్తడం ఖాయం. ఇక శనివారం నుంచి గబ్బా వేదికగా జరిగే మూడో టెస్ట్ పైనా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే గబ్బాలో టీమిండియా చారిత్రక విజయం సాధించిన క్షణాలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. గత పర్యటనలో రిషబ్ పంత్ హీరోయిజంతో గబ్బాలో కంగారూలను భారత్ చిత్తు చేసింది. మరోసారి అటువంటి ఆటతీరుతోనే భారత్ ఆసీస్ ను నిలువరించి సిరీస్ లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.