Maldives flight booking cancellation : బాయ్ కాట్ మాల్దీవ్స్.. మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్ రద్దు..
ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్, మాల్దీవుల వైపే.. ఇటీవల భారత ప్రధాని భారత దేశపు.. లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లిగా కోట్టిపారేస్తు.. మా దేశం మాల్దీవులకు మా దేశ లక్ష దీవులు లో పొంతనే లేదు అన్నట్టుగా లక్ష దీవుల పర్యటకు వ్యతిరేకంగా ఆరోపనలు, పోస్టులు పెడుతుంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు, మంత్రులు.
భారతదేశం పై మాల్దీవుల ప్రభుత్వానికి ఎందుకు అంత అక్కసు..
ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్, మాల్దీవుల వైపే.. ఇటీవల భారత ప్రధాని భారత దేశపు.. లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లిగా కోట్టిపారేస్తు.. మా దేశం మాల్దీవులకు మా దేశ లక్ష దీవులు లో పొంతనే లేదు అన్నట్టుగా లక్ష దీవుల పర్యటకు వ్యతిరేకంగా ఆరోపనలు, పోస్టులు పెడుతుంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు, మంత్రులు. దీంతో భారతదేశ సెలబ్రిటిలకు, సామాన్యులకు కోపం తెప్పించింది. ఇక దీంతో భారతదేశం నుండి మాల్దీవుల పర్యటనకు వెళ్లే పర్యటనకు ఉన్నపలంగా.. ఎవరికి వారు స్వతాగా తమ మాల్దీవుల పర్యటను రద్దు చేసుకుంటున్నారు.
- మాల్దీవుల పర్యటన ఫ్లైట్ మబుకింగ్స్ రద్దు..
భారత పర్యటక ప్రాంతం పై.. మోదీ పర్యటనపై చేసిన మాల్దీవుల మంత్రుల ఆరోపణలను భారత దేశమే కాకుండా.. మాల్దీవుల ప్రతి పక్ష నేతలకు కూడా వ్యతిరేకింస్తున్నారు.
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు.
- లక్షదీప్, భారత ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల ఆరోపణలు..
లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు.
పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు.
- లక్షదీప్ పై ఆరోపణల నేతలపై వేటు..
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సమస్య మరింత ముదరకుండదానే ఉద్దేశంతో.. ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ఏకంగా ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవల ప్రభుత్వం.