Women’s Premier League : పెర్రీ అందానికి పడిపోతున్న కుర్రాళ్లు.. ఆర్సీబీ బ్యాటర్ గురించి ఈ విషయాలు తెలుసా..
ఎలిస్ పెర్రీ.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ గురించే టాక్. బ్యూటీ విత్ టాలెంట్ అంటూ.. తెగ పొగిడేస్తున్నారు అంతా ! విమెన్స్ ప్రీమియర్ లీగ్ సెమీస్ (Women's Premier League) లో.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మీద పెర్రీ ఆడిన ఆట.. కుర్రాళ్ల మతి పోగొట్టేసింది.

Boys falling for Perry's beauty.. Do you know these things about RCB batter..
ఎలిస్ పెర్రీ.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ గురించే టాక్. బ్యూటీ విత్ టాలెంట్ అంటూ.. తెగ పొగిడేస్తున్నారు అంతా ! విమెన్స్ ప్రీమియర్ లీగ్ సెమీస్ (Women’s Premier League) లో.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మీద పెర్రీ ఆడిన ఆట.. కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో పెర్రీ కీ రోల్ ప్లే చేసింది. ఐతే ఆమె ఆటే కాదు.. అందం కూడా కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. పెర్రీ కోసమే విమెన్స్ ప్రీమియర్ లీగ్ చూసే వాళ్లు ఉన్నారు అంటే.. అర్థం చేసుకోవచ్చు అమ్మడి క్రేజ్. చీరకట్టులో పెర్రీని చూసి.. మనసు పారేసుకున్నవాళ్లు ఎందరో ! ఇప్పుడు పెర్రీ రీల్స్, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
ఈ బ్యూటిఫుల్ క్రికెటర్ (Beautiful cricketer) గురించి తెలుసుకునేందుకు.. కుర్రాళ్లంతా జై గూగుల్ అంటున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎలిస్ పెర్రీ టాప్ ప్లేయర్. పేస్ బౌలింగ్, మాస్ బ్యాటింగ్‌తో మోస్ట్ ప్రామినెంట్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. విమెన్ ప్రిమియర్ లీగ్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతోంది. ఆట, అందం కలిసిన పెర్రీ.. బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా.. ఆట మరింత అందంగా కనిపిస్తుందని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు. ఆసీస్ విమెన్స్ టీమ్‌లో పెర్రీ కీ ప్లేయర్‌గా ఉంది. ఆమె టీమ్‌లో ఉన్నారని తెలిస్తే.. ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తుతారు. 2007 నుంచి ఆమె క్రికెట్ ఆడుతోంది. జాతీయ, వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతోంది. బిగ్ బాష్, హండ్రెడ్ లీగ్‌ల్లోనూ అదరగొట్టింది. 1990 నవంబర్‌లో పుట్టిన పెర్రీ.. క్రికెట్‌తో పాటు సాకర్‌లోనూ రాటుదేలింది. 16 ఏళ్ల వయసులోనే జాతీయ క్రికెట్ జట్టుతో పాటు జాతీయ సాకర్ జట్టులోనూ పెర్రీ ఎంట్రీ ఇచ్చింది.
2014 నుంచి క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది. 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్టింగ్ సీజన్‌లో.. పెర్రీని కోటీ 70లక్షల ధరతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియన్ రగ్బీ ప్లేయర్ మాట్ టోమువాను 2015లో పెళ్లి చేసుకున్న పెర్రీ.. 2020లో డివోర్స్ తీసుకుంది. ఇప్పుడు WPLలో పెర్రీ పేరు మారుమోగిపోతుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే.. 6వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచింది. బ్యాట్‌తోనూ రాణించింది. ఆ మధ్య ఆమె కొట్టిన భారీ సిక్సర్‌కి.. గ్రౌండ్ బయట ఉన్న కారు అద్దం బ్రేక్ అయింది. దీంతో పెర్రీ.. పెర్రీ లేడీ అంటూ ఈ లేడీ క్రికెటర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్.