ఆటకు బ్రావో గుడ్ బై రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నైట్ రైడర్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో ఈ సీజన్ తొలి మ్యాచ్ కు ముందు తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు.
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల ఈ క్రికెటర్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నైట్ రైడర్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో ఈ సీజన్ తొలి మ్యాచ్ కు ముందు తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తన చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ గా పేర్కొన్నాడు. టీ ట్వంటీ క్రికెట్ లో ఈ విండీస్ ఆల్ రౌండర్ ఎన్నో రికార్డులు అందుకున్నాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. 2021 టీ ట్వంటీ వరల్డ్ కప్ తో అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన బ్రావో తర్వాత విదేశీ టీ ట్వంటీ లీగ్స్ లో కొనసాగాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో బ్రావో రికార్డులు చాలానే ఉన్నాయి. ఆల్ రౌండర్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు అనేక విజయాలు అందించాడు. చెన్నై జట్టు 4 సార్లు ట్రోఫీని గెలుచుకోవడంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌లో జరిగే కరేబియన్ లీగ్‌పై బ్రావో దృష్టి సారించాడు. రెండేళ్ల ముందు ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 క్రికెట్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడీగా నిలిచిన బ్రావో మొత్తం 630 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్ తోనూ రాణించి 441 ఇన్నింగ్స్ లలో 6970 పరుగులు చేసాడు.