బ్రేకింగ్: టెలిగ్రాంలో ఉగ్రవాదులకు డైరెక్షన్…
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసింది. ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్ మరియు ముజమ్మిల్ షరీఫ్‌లపై అభియోగాలు మోపింది ఎన్ఐఏ. భారతీయ శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం మరియు పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగపత్రం నమోదు చేశారు.
ఈ కేసులో నలుగురిని ముందుగా అరెస్టు చేయగా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నిందితులుగా ఉన్న తాహా, షాజిబ్ లకు వారి క్రిప్టో కరెన్సీల ద్వారా నిధులు సమకూర్చారు అని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తాహా టెలిగ్రామ్ ఆధారిత ప్లాట్ ఫారమ్‌ల సహాయంతో వారిని వాడుకున్నారని వెల్లడించారు. బెంగళూరుతో పాటుగా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు నిందితులు ఈ నిధులను ఉపయోగించారని దర్యాప్తు సంస్థ గుర్తించింది.